ప్రభాస్ పాన్ ఇండియా సినిమా ‘సలార్’ లో శ్రుతిహాసన్ కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే.. కేజీఎఫ్ ఫ్రేమ్ ప్రశాంత్ నీల్ రూపొందిస్తున్న ఈ చిత్రంలో యాక్షన్ సీన్స్ ఎక్కువగా ఉండనున్నాయి. ఇప్పటికే ప్రభాస్ దానికోసం చాలానే కసరత్తులు చేశారు. అయితే ప్రభాస్ సరసన నటించే శ్రుతిహాసన్ కు సైతం ఫైటింగ్ సీన్స్ కు స్కోప్ ఉందట.. దీనిపై ఆమె కూడా మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందుతోందని తెలుస్తోంది.. చాలా అనుభవం కలిగిన ట్రైనర్స్ మధ్య శ్రుతి ఈ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకొంటుందట. కాగా, శ్రుతి ఇదివరకే రెండు, మూడు సినిమాలో యాక్షన్ & ఫైటింగ్ సీన్స్ లో నటించిన విషయం తెలిసిందే.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ సెకండ్ వేవ్ తరువాత శరవేగంగా జరుగుతోంది. ప్రభాస్, శ్రుతిహాసన్ లపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రంతో పాటే డార్లింగ్ ప్రభాస్ ‘ఆదిపురుష్’ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఇక షూటింగ్ పూర్తిచేసుకున్న ‘రాధేశ్యామ్’ సంక్రాంతి కానుకగా జనవరి 14, 2022న విడుదల కానుంది.