ప్రభాస్ సరసన ‘ఖిలాడీ’ భామ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్‌తో కలిసి చేస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘సలార్’. శృతి హాసన్ కథానాయికగా నటిస్తున్న భారీ హైపర్ యాక్షన్ డ్రామా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటోంది. భారీ గ్యాంగ్ స్టర్ మూవీ “సలార్”లో ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ నటుడు జగపతిబాబు “సలార్”లో కీలక పాత్రలో కనిపించనున్నాడు. తాజా అప్‌డేట్ ప్రకారం ‘సలార్’లో మరో హీరోయిన్ కూడా నటించబోతోందని సమాచారం. మీనాక్షి చౌదరి అనే హీరోయిన్ ‘సలార్’లో రెండవ హీరోయిన్ గా నటిస్తోంది. మీనాక్షి చౌదరి ఇప్పటికే సుశాంత్ తో కలిసి ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ సినిమాలో కన్పించింది. ప్రస్తుతం ఆమె రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఖిలాడీ’ అనే యాక్షన్ డ్రామాలో మాస్ మహారాజా రవితేజతో స్క్రీన్ షేర్ చేసుకుంటోంది. మొదటి సినిమా పెద్దగా పేరు తీసుకురాకపోయినా వరుస ఆఫర్లతో దూసుకెళ్తోంది ఈ బ్యూటీ. ఇప్పుడు ప్రభాస్ సినిమాలో ఛాన్స్ పట్టేసిన మీనాక్షి ‘హిట్ 2’లో కూడా అవకాశం దక్కించుకుంది.
Rea Also : ‘గాడ్ ఫాదర్’ మ్యూజిక్ సెషన్ స్టార్ట్
Also Read
- Rashmika Mandanna: గానకోకిల బయోపిక్‌లో నేషనల్ క్రష్.. క్లాప్ కొట్టిన కమల్ హాసన్!
- CBFCలో ప్రక్షాళన.. కొత్త టీమ్‌లో ప్రీతి జింటా, సుప్రియ! కొత్త పాలకమండలి ఇదే..
- Anant Nag: కేజీఎఫ్ నటుడికి దాదాసాహెబ్ ఫాల్కే.. సినీ లెజెండ్‌పై ప్రధాని మోడీ పొగడ్తల వర్షం!
- The Paradise: కాకులు వేటకు సిద్ధమయ్యాయి.. నాని 'ది ప్యారడైజ్' టూర్ షెడ్యూల్ ఇదే! ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
ఇక ‘సలార్’ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగండూర్ నిర్మించారు. కన్నడ, తెలుగు భాషలలో ఏకకాలంలో చిత్రీకరించబడిన ఈ చిత్రం హిందీ, తమిళం, మలయాళంలో కూడా డబ్ చేయబడుతుంది. రవి బస్రూర్ సంగీతం సమకూర్చగా, సినిమాటోగ్రఫీ భువన్ గౌడ నిర్వహిస్తున్నారు. “సలార్” 14 ఏప్రిల్ 2022న గ్రాండ్ రిలీజ్ కానుంది. మరోవైపు ప్రభాస్ బాలీవుడ్ నటి దీపికా పదుకొనేతో పాటుగా నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించే ‘ప్రాజెక్ట్ కె’లో నటిస్తున్నారు. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ‘రాధే శ్యామ్’ వచ్చే ఏడాది థియేటర్లలోకి రానుంది.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!