క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ తో సమావేశం అయ్యారు మంత్రులు బొత్స, బుగ్గన, పేర్ని నాని, ప్రభుత్వ సలహాదారు సజ్జల, సీఎస్ సమీర్ శర్మ. హెచ్ఆర్ఏ, పెన్షన్ శ్లాబుల్లో మార్పులు, రికవరీ మినహాయింపుతో పడే ఆర్ధికభారంపై చర్చించారు. ఏడువేల 500 కోట్ల అదనపు భారం పడుతుందని అంచనా వేస్తున్నారు ఆర్ధిక శాఖ అధికారులు. స్టీరింగ్ కమిటీ సభ్యులు కమిటీ ముందు పెట్టిన ఇతర అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళారు మంత్రుల కమిటీ. నిన్న రాత్రి వరకు ఉద్యోగులతో…
ఏపీలో హాట్ టాపిక్ గా మారింది పీఆర్సీ అంశం. దీనిపై మంత్రుల కమిటీ భేటీ అయింది. పీఆర్సీ అంశంపై ఉద్యోగుల అసంతృప్తిని సరిదిద్దేందుకు మంత్రుల కమిటీ ప్రయత్నం చేసిందన్నారు సలహాదారు సజ్జల. ఉద్యోగ సంఘాల అనుమానాలు నివృత్తితో పాటు కొన్ని సర్దుబాటు చేశాం. కోవిడ్ కారణంగా ఇబ్బందులు ఉన్నా ఉదారంగానే ఉద్యోగుల కు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామన్నారు సజ్జల. చాలా అంశాల్లో ఉద్యోగ సంఘాలు అంగీకారానికి వచ్చాయని భావిస్తున్నాం అన్నారు. మళ్ళీ కలిసి పనీ చేస్తాం అన్న…
ఏపీలో పీఆర్సీ వివాదం పీటముడి వీడడం లేదు. పీఆర్సీ వ్యవహారం, ఉద్యోగుల ఆందోళనల పై ప్రభుత్వ సలహాదారు సజ్జల కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త పీఆర్సీ ప్రకారమే ఉద్యోగులకు జనవరి నెల వేతనాలు చెల్లిస్తాం అన్నారాయన. ఉద్యోగులు చేస్తున్న ఆందోళనలకు, ఉద్యోగ సంఘ నాయకులు పెట్టిన మూడు డిమాండ్లకు సంబంధం లేదన్నారు. ముఖ్యమైన హెచ్ఆర్ఏ సవరణ అంశాన్ని ఉద్యోగ సంఘాలు ప్రస్తావించటం లేదు. ఉద్యోగ సంఘాలు మంత్రుల కమిటీతో చర్చలకు వస్తే పాత జీతాలు వేసే అంశాన్ని…
ఆయనది ఆ జిల్లా కాదు. కానీ.. ఎన్నికల సమయంలో పార్టీ ఆదేశాలతో మరో జిల్లాకు వెళ్లి.. పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. అప్పట్లో ఆయనకు జైకొట్టిన పార్టీ కేడరే ఇప్పుడు రివర్స్. పార్టీ శ్రేణులకు ఎమ్మెల్యేలకు గ్యాప్ వచ్చిందని టాక్. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? ఏంటా లొల్లి? రెండున్నరేళ్ల తర్వాత సంతనూతలపాడు వైసీపీలో లుకలుకలుటీజేఆర్ సుధాకర్‌బాబు. ప్రకాశంజిల్లా సంతనూతలపాడు ఎమ్మెల్యే. గుంటూరు జిల్లాకు చెందిన సుధాకర్‌బాబు గత ఎన్నికల సమయంలో ప్రకాశం జిల్లాలోని సంతనూతలపాడు అభ్యర్థిగా వైసీపీ…
పాత తెలుగు సినిమాల్లో శాపనార్థాలు పెట్టే సీన్ రిపీట్ అయింది. చంద్రబాబు రెండు గంటల ప్రసంగంలో శాపాలు పెట్టడమే సరిపోయింది. చంద్రబాబు స్పీచ్ తో కార్యకర్తలకు కూడా ఊపు రావటం లేదు. ముందు కుప్పంలో నాయకత్వం మార్చాలి. చంద్రబాబు విఫల నాయకుడు. టీడీపీ ఓ విఫల పార్టీ. ప్రయత్నం కూడా చేయకుండా అప్పనంగా అధికారం రావాలని కోరుకునే వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.
ఏపీలో ఉద్యోగ సంఘాల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పీఆర్సీ పీటముడి వీడక పోవడంతో ఏంచేయాలో తెలీని పరిస్థితి ఏర్పడింది. వేర్వేరుగా సమావేశం అయిన ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి సంఘాల నేతలు భవిష్యత్ కార్యాచరణపై మల్లగుల్లాలు పడుతున్నారు. వేర్వేరు సమావేశాల అనంతరం సంయుక్తంగా సమావేశమై భవిష్యత్ కార్యాచరణ పై కసరత్తు చేయనున్నాయి రెండు జేఏసీలు. గత నెలలో ఎక్కడ ఉద్యమాన్ని వాయిదా వేశారో అక్కడి నుంచే కార్యాచరణ ప్రారంభించనున్నాయి ఉద్యోగ సంఘాలు. నిరసన కార్యక్రమాలు వెంటనే…
ఏపీలో పీఆర్సీ రగడకు ఎందుకు ఎండ్‌కార్డ్ పడటం లేదు? ప్రభుత్వమా లేక ఉద్యోగ సంఘాల నాయకత్వం దీనికి కారణమా? సర్కార్‌కు కలిసి వస్తున్న అంశాలేంటి? JACలో గ్రూపు తగాదాలను చూసి ఆనందిస్తోంది ఎవరు? రెండు వారాలుగా చర్చలు జరుగుతున్న పీఆర్సీపై వీడని పీటముడి..!గల్లా పెట్టే గలగల లాడక ప్రభుత్వానికి ఊపిరి ఆడటం లేదు. ఇదే టైమ్‌లో ఉద్యోగ సంఘాలు జీతాలు పెంచాలని రోడ్డెక్కాయి. సాధ్యమైనంత తక్కువగా ఫిట్‌మెంట్ ఫిక్స్ చేసి ప్రభుత్వంపై ఎక్కువ భారం పడకుండా ఆర్థికశాఖ…
ఏపీలో పీఆర్సీపై నెలకొన్న సందిగ్ధత వీడలేదు. అమరావతిలోని సచివాలయంలో ముగిసింది జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం. వచ్చే వారం ముఖ్యమంత్రి జగన్ తో ఉద్యోగ సంఘాల భేటీ జరిగే అవకాశం వుంది. ఆ తర్వాతే ఫిట్ మెంట్, ఇతర ఆర్థిక అంశాల పై స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇదిలా వుంటేఏపీ జేఏసీ చైర్మన్ బండి శ్రీనివాస రావు, ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు సమావేశం అనంతరం మాట్లాడారు. మా 71 డిమాండ్ల పై అధికారులు…
ఏపీలో అధికారులు, ఉద్యోగుల మధ్య పీఆర్సీ పీటముడి వీడడం లేదు. కాసేపట్లో ప్రారంభం కానుంది పీఆర్సీ పై కీలక సమావేశం. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమావేశం కానున్నారు ప్రభుత్వ సలహాదారు సీఎస్ సమీర్ శర్మ, ఆర్ధిక శాఖ అధికారులు శశిభూషణ్, రావత్. అనంతరం సీఎంతో భేటీ కానుంది అధికారుల బృందం. ఐఆర్ 27 శాతం ఇస్తున్న నేపథ్యంలో దీని కంటే ఎక్కువ ఫిట్ మెంట్ ఉండాలని డిమాండ్ చేస్తున్నాయి ఉద్యోగ సంఘాలు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అదనపు…
పీఆర్సీ పై పీటముడి వీడడం లేదు.. పీఆర్సీ, ఇతర 70 డిమాండ్లపై ఉద్యోగ సంఘాలతో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారుల సజ్జల నిన్న జరిపిన చర్చలు అసంపూర్తిగానే ముగిశాయి.. అయితే.. ఇవాళ అంటే.. వరుసగా మూడో రోజూ కూడా చర్చలు కొనసాగనున్నాయి.. ఉద్యోగ సంఘాలతో మరో దఫా చర్చించనున్నారు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన, ప్రభుత్వ సలహాదారు సజ్జల.. ఫిట్‌మెంట్, మానిటరీ బెనిఫిట్స్ అమలు తేదీ తేలటమే కీలకంగా మారినట్టుగా తెలుస్తోంది.. మరోవైపు,…