భారత్ లో క్రికెట్ ఒక మతం అయితే అతడు దేవుడు. అతని పేరు వింటే చాలు దిగ్గజ బౌలర్లకు కూడా నిద్ర పట్టని సందర్భాలు చాలానే ఉన్నాయి. అతడుబ్యాటింగ్ కి వచ్చాడంటే సెంచరీ ఖాయం అని అనుకొనే ఫామ్ అతడిది. అతడు సరిగ్గా బ్యాటింగ్ చేస్తే భారత్ విజయం సాధించినట్టే అని అనుకొనే ఆట అతని సొంతం. అతను అవుట్ అయితే చాలు TV లు ఆఫ్ చేసి, మ్యాచ్ ఓడినట్టే అని అనుకునేవాళ్లం . అతను మరెవరో కాదు క్రికెట్ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్. అయితే IPLలో ముంబై ఇండియన్స్ జట్టును సచిన్ టెండూల్కర్ లను విడదీసి చూడలేము. 2008 నుంచి 2013 వరకు ఆటగాడిగా కొనసాగిన సచిన్.. ఆ తర్వాత ఆ జట్టుకు మెంటార్ గా ఉంటున్నాడు.
ఇక సచిన్ వారసత్వాన్ని క్రికెట్ ఆడితే చూడాలని అతడి ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. అర్జున్ టెండూల్కర్ ముంబై జట్టు కొనుగోలు చేయడంతో త్వరలోనే ఆ కోరిక తీరుతుందని అంతా భావించారు. ఇక ఈ సీజన్ లో తప్పకుండా బరిలోకి దిగతాడని గంపెడు ఆశతో సచిన్ అభిమానులు ఎదురు చూశారు.
అయితే వారికి చివరకు నిరాశే ఎదురైంది. అర్జున్ ముంబై తరపున ఈ సీజన్ లో అరంగేట్రం చేయగా.. క్రికెట్ దేవుడి కొడుకు ఎంట్రీ మాత్రం జరగలేదు. దాంతో ముంబై జట్టుపై సచిన్ ఫ్యాన్స్ తీవ్ర విమర్శలు చేశారు. తాజాగా అర్జున్ టెండూల్కర్ ను IPL 2022 లో ఎందుకు ఆడించలేదో ఆ జట్టు బౌలింగ్ కోచ్ షేన్ బాండ్ వివరణ ఇచ్చాడు. అర్జున్ ఆట పేలవంగా ఉందనే అర్థం వచ్చేలా కామెంట్స్ చేశాడు.
“అర్జున్ ఇంకా చాలా మెరుగుపడాలి. ఏ ఆటగాడైనా జట్టులోకి రావడం ఒకవంతు అయితే.. తుది జట్టులో చోటు దక్కించుకోవడం మరో ఎత్తు. అందుకోసం అతడు ఇంకా కష్టపడాలి. చాలా వర్కవుట్స్ చేయాల్సి ఉంది. ముఖ్యంగా బ్యాటింగ్, ఫీల్డింగ్‌లో అతడు మరింత రాటుతేలాలి. ఆ విభాగాల్లో అతడు పురోగతి సాధించాడని జట్టు భావిస్తే అర్జున్ కు ఖచ్చితంగా అవకాశం ఇస్తాం” అని షేన్ బాండ్ పేర్కొన్నాడు.ఇక ఈ IPL సీజన్ లో ముంబై ఇండియన్స్ దారుణ ఆటతీరును కనబర్చింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పేలవ ఆటతీరు కనబర్చి ఆడిన 14 మ్యాచ్ ల్లో కేవలం 3 మ్యాచ్ ల్లోనే గెలిచి 6 పాయింట్లతో లీగ్ టేబుల్లో చిట్ట చివరి స్థానంలో నిలిచింది.