Anil Kumar Yadav: ఏపీలోని బీజేపీ నేతలపై నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయ్యప్ప మాలలో ఉండి తానేదో నేరం, పాపం చేసినట్లు బీజేవైఎం నేతలు ఓవరాక్షన్ చేస్తున్నారని మండిపడ్డారు. తాను ముస్లిం కండువా కప్పుకోవడాన్ని తప్పుబడుతున్న బీజేపీ నేతలకు.. శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులందరూ ఎరుమేలిలో వావర్ స్వామిని దర్శించుకునే విషయం తెలియదా అని ప్రశ్నించారు. వావర్ స్వామి ముస్లిం కాదా అని నిలదీశారు. కన్నెస్వాములందరూ వావర్ స్వామి…