ఎస్.వి.కృష్ణారెడ్డి దర్శకుడే, అంతకు మించిన సంగీత దర్శకుడు! ఆయన దర్శకత్వంలో రూపొందిన చిత్రాల్లో ఈ తరం వారికి పలు లోటుపాట్లు కనిపించవచ్చు. కానీ, కృష్ణారెడ్డి స్వరకల్పన మాత్రం ఈ నాటికీ వీనులవిందు చేస్తూనే ఉంటుంది. ఎస్వీ కృష్ణారెడ్డి సినిమాల్లో వినోదంతో పాటు సంగీతమూ ఆనందం పంచేది. ఎస్వీ జైత్రయాత్ర సాగుతున్న రోజుల్లో పాటలపందిళ్ళు కూడా వేస్తూ సాగారు. ప్రతీచోట జేజేలు అందుకున్నారు. అందుకే కొందరికి ఆయన ‘ఎస్.వి.’ అంటే ‘స్వరాల వరాల కృష్ణారెడ్డి’ అనిపించారు. మరికొందరికి స్వర…