Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన సీజ్‌ఫైర్‌కి తనదే క్రెడిట్ అంటూ ఆయన పేర్కొన్నారు. ఇదే కాదు, గత ఐదు నెలల్లో తాను 5 యుద్ధాలను ఆపినట్టు ఆయన పేర్కొన్నాడు. అంతేకాకుండా ట్రంప్ మాట్లాడుతూ.. ఇది బైడెన్ యుద్ధం. దీనినుంచి బయటపడేందుకు మేము తీవ్రంగా ప్రయత్నిస్తున్నాం. గత ఐదు నెలల్లో ఐదు యుద్ధాలను నేను ఆపేశాను. నిజంగా చెప్పాలంటే, ఇది ఆరో యుద్ధం…
India On US Tarrifs: భారత ఉత్పత్తులపై అమెరికా 25 శాతం సుంకాలు విధించడం, రష్యా నుంచి భారత్ ముడిచమురును దిగుమతి చేసుకోవడంపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసింది. అయితే, అమెరికా కామెంట్లపై భారత్ శుక్రవారం ఘాటుగానే స్పందించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ శుక్రవారం ఈ విషయం గురించి మాట్లాడారు. ‘‘మా ఇంధన అవసరాలను తీర్చడంలో, మార్కెట్‌లో అందుబాటులో ఉన్న, ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల ద్వారా నిర్ణయం తీసుకుంటాము’’ అని…
Arunachal CM: అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండు సంచలన వ్యాఖ్యలు చేశారు. చైనాకు మింగుడు పడలేని వ్యాఖ్యలు ఆయన నోటి నుంచి వచ్చాయి. అరుణాచల్‌కు చైనాతో సరిహద్దు లేదని, కేవలం టిబెట్‌తో మాత్రమే సరిహద్దు ఉందని అన్నారు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అరుణాచల్ ప్రదేశ్ చైనాతో 1200 కి.మీ సరిహద్దు పంచుకుంటుందని ఇంటర్వ్యూ చేసే వ్యక్తి అనగా, దీనికి పెమా ఖండు స్పందిస్తూ.. ‘‘నేను ఈ విషయంలో మిమ్మల్ని కరెక్ట్ చేయాలి, మేము చైనాతో కాదు…
Quad: భారతదేశానికి అతిపెద్ద దౌత్య విజయం దక్కింది. క్వాడ్ గ్రూప్ (భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్) ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడిని ఖండించింది. 26 మంది అమాయకుల ప్రాణాలు తీసిన వారిపై చర్యలు తీసుకోవాలని క్వాడ్ గ్రూప్ విదేశాంగ మంత్రులు కోరారు.
Jai Shankar: జమ్మూ కాశ్మీర్‌లో పర్యాటకాన్ని, ఆర్థిక వ్యవస్థను నాశనం చేయడానికి పాకిస్తాన్ ఉగ్రవాదులు పహల్గామ్ ఉగ్రదాడి చేశారని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. ఇది ‘‘ఆర్థిక యుద్ధ చర్య’’గా అభివర్ణించారు. ఇస్లామాబాద్‌తో కాల్పుల విరమణ ఒప్పందంలో ట్రంప్ పాత్ర లేదని మరోసారి స్పష్టం చేశారు. పాకిస్తాన్ నుంచి వస్తున్న ఉగ్రవాదానికి ప్రతిస్పందించకుండా భారత్‌ని ఎవరూ అడ్డుకోలేరని వెల్లడించారు. న్యూయార్క్‌లో న్యూస్‌వీక్‌తో జరిగిన ప్రత్యేక సంభాషణలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు.
ఎంపీ శశి థరూర్‌కు సొంత పార్టీ కాంగ్రెస్‌తో విభేధాలు ఉన్నాయని పుకార్లు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. ఇటీవల.. అమెరికాకు వెళ్లే ప్రతినిధి బృందానికి భారత ప్రభుత్వం శశి థరూర్‌ను నాయకుడిగా నియమించింది. విదేశాలకు వెళ్లే ప్రతినిధి బృందం కోసం కాంగ్రెస్ శశి థరూర్ పేరును ప్రతిపాదించలేదు.
S Jaishankar: యూరోపియన్ యూనియన్ నేతలతో చర్చల కోసం విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ బ్రస్సెల్స్‌లో ఉన్నారు. ఈ పర్యటనలో పాకిస్తాన్ తీరును మరోసారి ఆయన ఎండగట్టారు. కాశ్మీర్‌లో ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య ఘర్షణను ఉగ్రవాదంపై భారత్ తీసుకుంటున్న చర్యలుగా చూడాలని, కేవలం ఇరు దేశాల మధ్య సరిహద్దు సమస్యగా చూడొద్దని వెస్ట్రన్ దేశాలకు పిలుపునిచ్చారు.
S Jaishankar: పాకిస్తాన్ ఉగ్రవాదులకు మద్దతు ఇస్తే భారత్ దానిని లక్ష్యంగా చేసుకుంటుందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ స్పష్టం చేశారు. యూరప్ పర్యటనలో ఉన్న ఆయన ఫ్రాన్స్ పొలిటికోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాకిస్తాన్‌ని టార్గెట్ చేస్తూ హెచ్చరించారు. ‘‘వారు ఎక్కడ ఉన్నారో మాకు పట్టింపు లేదు. వారు పాకిస్తాన్‌లో ఉంటే, మేము పాకిస్తాన్‌లోకి వెళ్తాము’’ అని అన్నారు.
S Jaishankar: భారత్ ఉగ్రవాదాన్ని ఎంతమాత్రం సహించదని, న్యూఢిల్లీ ఎప్పటికీ అణ్వాయుధ బెదిరింపులకు లొంగదని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ శుక్రవారం అన్నారు. జర్మన్ విదేశాంగ మంత్రి జోహన్ వాడేఫుత్‌తో జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భారత, పాక్ మధ్య వ్యవహారం ద్వైపాక్షికం అని, ఈ విషయంలో ఎలాంటి గందరగోళం ఉండకూడదని అన్నారు.
S Jaishankar: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ ఉగ్రవాదులే టార్గెట్‌గా ‘‘ఆపరేషన్ సిందూర్’’ నిర్వహించింది. ఆ తర్వాత పాక్ జరిపిన వైమానిక దాడుల్ని తిప్పికొట్టింది. భారత దాడుల్లో పాకిస్తాన్ సైన్యానికి చెందిన 11 కీలకమైన ఎయిర్ బేస్‌లు ధ్వంసమయ్యాయి. ఈ పరిణామాల తర్వాత భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ డచ్ మీడియాకు బుధవారం ఇంటర్వ్యూ ఇచ్చారు. దీంట్లో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునిర్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఆసిమ్…