రైతు గర్జనలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొద్దు నిద్ర పోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరవాలని విమర్శలు గుప్పించారు. రైతు బంధు, రుణ మాఫీ, ధాన్యం కొనుగోళ్ళ కోసం రైతు దీక్ష చేస్తున్నాం.. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ఎత్తి చూపేందుకే రైతు దీక్ష చేస్తున్నామన్నారు.
విజయవాడలో బీజేపీ కిసాన్ మోర్చా రైతు గర్జన సభ నిర్వహించారు. ఈ సభకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, సత్యకుమార్, కామినేని శ్రీనివాస్ హాజరయ్యారు. రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి రైతులు భారీ ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ మాట్లాడుతూ.. రైతులను ఆపి అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో వైసీపీ పాలనపై ప్రజలు వ్యతిరేకత చూపిస్తున్నారని ఆరోపించారు. మేనిఫెస్టోలో హామీ ఇవ్వకపోయినా.. 11 కోట్ల రైతన్నలకు డీబీటి ద్వారా మోదీ ఇస్తున్నారని…