ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది.. ఓ వైపు ఉక్రెయిన్ చర్చలకు ప్రతిపాదనలు పంపుతున్నా.. రష్యా మాత్రం దాడులు చేస్తూనే ఉంది.. ఇక, రష్యాతో నాటో ప్రత్యక్ష పోరుకు దిగితే అది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని వార్నింగ్ ఇచ్చారు అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్. ఆ పరిణామాలను నివారించేందుకే ఉక్రెయిన్ విషయంలో రష్యాతో అమెరికా నేరుగా పోరాటం చేయట్లేదని వెల్లడించారు. అయితే ఉక్రెయిన్‌పై రష్యా రసాయన ఆయుధాలు వినియోగిస్తే.. భారీ మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు.…
రష్యా భూతలం, గగనతంల అనే తేడాలేకుండా.. అన్ని వైపుల నుంచి ఉక్రెయిన్‌పై విరుచుకుపడుతోంది.. మరోవైపు అగ్రరాజ్యం అమెరికా హెచ్చరించినా.. ఆ దేశానికి సంబంధించిన ఖాతాలను ఫ్రీజ్ చేస్తున్నా.. ఆ దేశానికి చెందిన ప్రముఖుల బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసినా.. యుద్ధ రంగంలోమాత్రం రష్యా దూసుకుపోతూనే ఉంది.. రెండో రోజూ ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను టార్గెట్ చేసింది రష్యా.. అయితే, రష్యాతో జరుగుతున్న పోరాటంలో తాము ఒంటరిగా మిగిలిపోయామంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ.. రష్యా తమపై…
ఉక్రెయిన్‌పై ఏ క్షణాన్నైనా యుద్దానికి దిగేందుకు రష్యా ప్రయత్నాలు ప్రారంభించినట్లు కనిపిస్తోంది . ఓవైపు అమెరికాతో చర్చలంటూనే, ఉక్రెయిన్‌లోని తిరుగుబాటుదారులతో దాడులు చేయిస్తోంది. జాతిని ఉద్దేశించి ప్రసంగించిన రష్యా అధ్యక్షుడు పుతిన్.. ఉక్రెయిన్ దగ్గర అణుబాంబు ఉందని ఆరోపించారు. కొన్నిదేశాల ఆర్మీ సహకారంతో రష్యాపై దాడికి ఉక్రెయిన్ ప్రయత్నిస్తోందన్నారు. చొరబాటుకు ప్రయత్నించిన ఐదుగురు ఉక్రెయిన్ సైనికులను రష్యా దళాలు కాల్చి చంపినట్లు తెలిపింది రష్యా.. ఇక, రష్యా బలహీనపడాలని అమెరికా కోరుకుంటోందని మండిపడ్డారు. తమపై దాడి చేస్తే…