అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్-రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. నిన్నామొన్నటి దాకా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీపై గరం గరంగా ఉన్న ట్రంప్.. ఇప్పుడు డైరెక్షన్ మారింది. తాజాగా పుతిన్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Donald Trump : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం డొనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో మాట్లాడారు. ఉక్రెయిన్‌లో నెలకొన్న పరిస్థితులపై ఇరువురు నేతలు చర్చించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
PM Modi Russia Tour: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇవాళ్టి నుంచి రెండు రోజుల పాటు రష్యాలో పర్యటించనున్నారు. 22వ ఇండో– రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొనబోతున్నారు.
PM Modi: రష్యా ఎన్నికల్లో వ్లాదిమిర్ పుతిన్ భారీ విజయం సాధించారు. మరో 6 ఏళ్ల పాటు రష్యా అధ్యక్షుడిగా ఉండేందుకు పుతిన్‌కి అవకాశం లభించింది. అయితే, బుధవారం భారత ప్రధాని నరేంద్రమోడీ, పుతిన్‌కి ఫోన్ చేసి అభినందనలు తెలియజేశారు. ఇరువురు నేతలు, భారత్-రష్యా మధ్య ప్రత్యేక, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని విస్తరించేందుకు తమ ప్రయత్నాలను తీవ్రతరం చేయాలని అంగీకరించారు. ఈ మేరకు ప్రధాని మోడీ ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు.
G20 Summit: ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఢిల్లీలో నేడు వర్చువల్ జీ20 సదస్సు నిర్వహించనున్నారు. ఈ సదస్సులో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా పాల్గొంటారని క్రెమ్లిన్ తెలిపింది.
ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణతో వందల మంది సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై సైనిక చర్య ప్రారంభించింది రష్యా. యుద్ధం మొదలై రెండు వారాలు దాటిపోయింది. ఉక్రెయిన్ లో అపార ప్రాణ, అస్తి నష్టం జరుగుతోంది. ఇళ్లు, అపార్ట్‌మెంట్స్, హాస్పిటల్స్ ఇలా మౌలిక వసతులన్ని దెబ్బతిన్నాయి. సిటీలన్నీ శిథిలాలతో నిండిపోయాయి. నివాస ప్రాంతాల్లోనూ రష్యా సైన్యం దాడులు చేస్తుండటంతో ప్రాన నష్టం భారీగానే జరుగుతోంది. చనిపోయిన సాధారణ పౌరుల సంఖ్య వెయ్యి దాటిందని అంచనా…
ప్రపంచం ఇప్పుడు రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య శాంతి నెలకొనాలని ఆకాంక్షిస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం రెండు దేశాల మధ్య శాంతి చర్యలు జరగనున్నాయి. గత రెండు విడతల చర్చలు విఫలం అయ్యాయి. పశ్చిమ దేశాల రష్యాపై ఆంక్షలు విధించడం యుద్దం ప్రకటించడం లాంటిదేనన్నారు అధ్యక్షుడు పుతిన్. ఉక్రెయిన్-రష్యా యుద్ధం ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ పై తీవ్ర ప్రభావం ఉంటుందని హెచ్చరించింది అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ. ఉక్రెయిన్ గగనతలాన్ని “నో ఫ్లై జోన్” గా ప్రకటించే ప్రయత్నం…
రష్యా-ఉక్రెయిన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అన్ని దేశాలను టెన్షన్ పెడుతున్నాయి.. ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని ప్రారంభించిన రష్యా.. ఆ దేశ రాజధాని వైపు దూసుకెళ్తుండగా.. మరోవైపు ఉక్రెయిన్ వ్యవహారంలో రష్యా తగిన మూల్యం చెల్లించకతప్పదని అమెరికా హెచ్చరిస్తూ వస్తోంది.. ఇక, ఉక్రెయిన్ నుంచి కొంత మంది భారతీయులను తరలించినా.. ఇంకా చాలా మంది ఉక్రెయిన్‌లో ఉంటున్నారు.. ఈ నేపథ్యంలో.. రంగంలోకి దిగారు భారత ప్రధాని నరేంద్ర మోడీ.. ఉక్రెయిన్‌లో ఉంటున్న భారతీయ పౌరుల భద్రత, క్షేమం కోసం…