PM Modi: రష్యా ఎన్నికల్లో వ్లాదిమిర్ పుతిన్ భారీ విజయం సాధించారు. మరో 6 ఏళ్ల పాటు రష్యా అధ్యక్షుడిగా ఉండేందుకు పుతిన్‌కి అవకాశం లభించింది. అయితే, బుధవారం భారత ప్రధాని నరేంద్రమోడీ, పుతిన్‌కి ఫోన్ చేసి అభినందనలు తెలియజేశారు. ఇరువురు నేతలు, భారత్-రష్యా మధ్య ప్రత్యేక, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని విస్తరించేందుకు తమ ప్రయత్నాలను తీవ్రతరం చేయాలని అంగీకరించారు. ఈ మేరకు ప్రధాని మోడీ ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు.
Vinay Kumar: రష్యాలో భారత రాయబారిగా వినయ్ కుమార్‌ని నియమించినట్లు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ(ఎంఈఏ) తెలియజేసింది. ప్రస్తుతం మయన్మార్‌లో భారత రాయబారిగా ఉన్న 1992 బ్యాచ్ ఐఎఫ్ఎస్ అధికారి వినయ్ కుమార్, త్వరలోనే తన బాధ్యతలు చేపడుతారని ఎంఈఏ తెలియజేసింది. ఇటీవల రష్యాలో ఎన్నికలు జరిగాయి, మరోసారి పుతిన్ భారీ మెజారిటీతో రష్యా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయన గెలుపు తర్వాత ఈ నియామకం చోటు చేసుకుంది.
Russia Ukraine War : ఉక్రెయిన్ .. రష్యా భూభాగాలపై ఒక్కొక్కటిగా అనేక డ్రోన్ దాడులను నిర్వహించింది. అధ్యక్ష ఎన్నికల చివరి రోజున రష్యన్లు ఓటింగ్ చేస్తున్న సమయంలో ఈ దాడులు జరిగాయి.
Russia: రష్యాకు చెందిన ఆయిల్ అండ్ గ్యాస్ దిగ్గజం లుకోయిల్ వైస్ ప్రెసిడెంట్ విటాలీ రాబర్టస్ తన కార్యాలయంలో ఆత్మహత్య పాల్పడ్డారు. మార్చి 12న రాబర్టస్ మరణించాడని లుకోయిల్ సంస్థ చెప్పినట్లు యూరో న్యూస్ నివేదించింది. రష్యాలో అతిపెద్ద చమురు కంపెనీ లుకోయిల్ డిప్యూటీ సీఈవో విటాలీ రాబర్టస్(53) అకస్మాత్తుగా మరణించారని ఉక్రేనియన్-అమెరికన్ ఆర్థికవేత్త రోమన్ షరెమెటా ట్వీట్ చేశారు. అయితే మరణానికి కారణాలను వెల్లడించలేదు.
ప్రస్తుతం రష్యాలో అధ్యక్ష ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న రష్యన్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. రష్యా ఎన్నికలకు భారత్‌లోనూ ఓటింగ్ జరుగుతోంది. రష్యా ఎన్నికలకు భారతదేశంలోని కేరళ రాష్ట్రంలో కూడా ఓటింగ్ జరిగింది. ఈ ఎన్నికల్లో వ్లాదిమిర్ పుతిన్ విజయం దాదాపు ఖాయమని చెబుతున్నారు.
ఉక్రెయిన్‌పై మరోసారి రష్యా డ్రోన్ దాడులతో విరుచుకుపడింది. బుధవారమే రష్యా అధ్యక్షుడు పుతిన్.. అణు యుద్ధం తప్పదంటూ వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటల్లోనే ఉక్రెయిన్‌లోని అనేక ప్రాంతాలపై డ్రోన్ దాడులను ప్రయోగించింది.
Ukraine War: రష్యా సార్వభౌమాధికారానికి ముప్పు వాటిల్లితే అణ్వాయుధ దాడి తప్పదని పుతిన్ హెచ్చరించాడు. ఉక్రెయిన్‌పై అణ్వాయుధాలను ప్రయోగించేందుకు మాస్కో సిద్ధంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు. అయితే, రష్యా అణుదాడికి పాల్పడుతున్నట్లు ఎలాంటి సంకేతాలు కనిపించడం లేదని అమెరికా బుధవారం తెలిపింది. ఫిబ్రవరి, 2022లో ఉక్రెయిన్‌పై దాడి చేసినప్పటి నుంచి అణ్వాయుధాలపై నిర్లక్ష్యంగా మాట్లాడుతోందని అమెరికా ప్రెస్ సెక్రటరీ కరీన్ జిన్ పియర్ అన్నారు.
Russia: ఓ వైపు రెండేళ్లు గడుస్తున్నా రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతూనే ఉంది. మరోవైపు ఫిన్లాండ్- రష్యా సరిహద్దుల్లో కూడా ఉద్రిక్తతలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఫిన్లాండ్ సరిహద్దుల్లో తమ దళాలను, స్ట్రైక్ సిస్టమ్‌లను మోహరిస్తామని రష్యా అధినేత పుతిన్ చెప్పినట్లు ఆల్ జజీరా నివేదించింది.
Russia: టేకాఫ్ సమయంలో 15 మందితో వెళ్తున్న రష్యన్ IL-76 మిలిటరీ కార్గో విమానం కూలిపోయింది. మాస్కోకు ఈశాన్యంలో ఉన్న ఇవానోవో ప్రాంతంలోని ఎయిర్ ఫీల్డ్ నుంచి టేకాఫ్ అవుతుండగా మంగళవారం విమానం కూలిపోయినట్లుగా రష్యా తెలిపింది. 8 మంది సిబ్బంది, ఏడుగురు ప్రయాణికులు ఉన్నట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. విమానంలో ఉన్న వారంతా మరణించినట్లు సమాచారం.
Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మహిళా దినోత్సవం సందర్భంగా ఆ దేశ మహిళలపై ప్రశంసలు కురిపించారు. దేశంలో జననాల రేటు పెంచేందుకు రష్యా ప్రభుత్వం ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఇటీవల పలుమార్లు రష్యా అధినేత మహిళలను ఉద్దేశిస్తూ ప్రసంగించారు. మాతృత్వం, ఆకర్షణ, అందం యొక్క బహుమతులను అందించినందుకు మహిళల్ని ప్రత్యేకంగా వారిని అభినందించారు. మార్చి 8 అనేది సోవియల్ సమయం నుంచి రష్యాలో అత్యంత ముఖ్యమైన రోజుల్లో ఒకటిగా ఉంది. స్త్రీల గొప్పతనం గురించి వారి నైపుణ్యాల…