Putin Assassination Attempt: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హత్యాయత్నం నుంచి తప్పించుకున్నారు. యూరో వీక్లీ న్యూస్ ఈ విషయాలను వెల్లడించింది. పుతిన్ పై హత్యాయత్నం జరిగినట్లు బుధవారం జనరల్ జీవీఆర్ టెలిగ్రామ్ ఛానెల్ ఈ సమాచారాన్ని విడుదల చేసినట్లు తెలిపింది. అయితే ఈ హత్యాయత్నం ఎప్పుడు జరిగిందనేదానిపై క్లారిటీ లేదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉక్రెయిన్ దేశంపై రష్యా దాడికి పాల్పడుతున్నప్పటి నుంచి పుతిన్ ఆరోగ్యం క్షీణించిందని.. అతని ప్రాణాలకు ముప్పు ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి.
PM Modi among 15 leaders to attend SCO summit: సెప్టెంబర్ 15,16 తేదీల్లో ఉజ్బెకిస్తాన్ ఉజ్బెకిస్తాన్‌లోని సమర్‌కండ్‌లో జరిగే షాంఘై సహకార సంస్థ (ఎస్‌సిఓ) శిఖరాగ్ర సమావేశానికి హాజరుకానున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ప్రధాని మోదీతో పాటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జి జిన్ పింగ్ హాజరుకానున్నారు. మోదీతో పాటు 15 మంది ప్రపంచ దేశాల నేతలు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. కోవిడ్ మహమ్మారి తరువాత ఇది మొదటి సమావేశం.…
Russian businessman died after falling from a hospital window: ఉక్రెయిన్‌పై రష్యా దాడిని వ్యతిరేకించిన రష్యన్ వ్యాపారవేత్త అనుమానాస్పద స్థితిలో మరణించారు. దేశంలో అతిపెద్ద చమురు కంపెనీ లుకోయిల్ చైర్మన్ రావిల్ మగనోవ్(67) ఆస్పత్రి కిటీకి నుంచి పడి గురువారం చనిపోయారు. ఇదే ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆయన మరణం మిస్టరీగా మారింది. దీనిపై రష్యా ఏజెన్సీలు విచారణ జరుపుతున్నాయి. మగనోవ్ సెంట్రల్ క్లినికల్ ఆస్పత్రి ఆరో అంతస్తు నుంచి పడి చనిపోయారు.
Soviet Union Last President Mikhail Gorbachev died: సోవియట్ యూనియన్ చివరి అధ్యక్షుడిగా ఉణన్న మికాయిల్ గోర్బచెవ్ తన 91వ ఏట మాస్కోలో మంగళవారం మరణించారు. దీర్ఘకాలిక సమస్యలతో పలు రోజుల నుంచి మాస్కో సెంట్రల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. గోర్బచేవ్ 1985-91 మధ్య సోవియట్ రష్యాకు అధ్యక్షుడిగా వ్యవహరించారు. సోవియట్ యూనియన్ పతనానికి కారణం అయిన వ్యక్తిగా కొంత మంది గొర్బచేవ్ ను నిందిస్తే.. ప్రచ్ఛన్న యుద్ధం ముగించిన వ్యక్తిగా పాశ్చాత్య దేశాలు…
Russian Strike On Ukraine Rail Station: ఉక్రెయిన్ - రష్యా మధ్య యుద్ధం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. ఈ రెండు దేశాల మధ్య ఈ ఏడాది ఫిబ్రవరి 24న యుద్ధం ప్రారంభం అయింది.. ఆరు నెలలు పూర్తి అయినా రెండు దేశాలు పట్టువీడటం లేదు. ముఖ్యంగా రష్యా దాడుల్లో ఉక్రెయిన్ సర్వనాశనం అవుతోంది. ఇదిలా ఉంటే రష్యా జరిపిన మిస్సైల్ దాడిలో 22 మంది మరణించారని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ బుధవారం వెల్లడించారు.
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభం అయి దాదాపుగా మూడు నెలలు గడిచిపోయింది. ఇప్పటికీ రష్యా తన దాడులను కొనసాగిస్తోంది. బలమైన రష్యా ముందు కేవలం వారాల్లోనే ఉక్రెయిన్ లొంగిపోతుందని అంతా అనుకున్నప్పటికీ రష్యాకు ఎదురొడ్డి పోరాడుతోంది. అయితే అమెరికా, బ్రిటన్ వంటి నాటో దేశాలతో పాటు యూరోపియన్ యూనియన్ దేశాలు ఉక్రెయిన్ కు సైనికంగా, వ్యూహాత్మకంగా సాయపడటంతో ఉక్రెయిన్ ఆర్మీ ఎదురునిలిచి పోరాడుతోంది. ఇదిలా ఉంటే జర్మనీ, ఫ్రాన్స్ కూడా ఉక్రెయిన్ కు ఆయుధాల సరఫరా చేయడానికి…