Japan PM Kishida Visits Ukraine: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం సంభవించింది. జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా ఉక్రెయిన్ లో ఆకస్మిక పర్యటన చేశారు. ప్రధాని కిషిడా ఉక్రెయిన్ రాజధాని కీవ్ లో పర్యటించారు. ఈ నెలలో 19 నుంచి 21 వరకు ఆయన భారత్ లో పర్యటించారు. ఇదే దేశాల మధ్య పలు ద్వైపాక్షిక ఒప్పందాలు కుదిరాయి. ఆ తరువాత ఆయన ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లారు. ప్రభుత్వ విమానంలో కాకుండా చార్టెడ్ విమానంలో పోలాండ్…
Ukraine War: రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం తీవ్రస్థాయిలో జరుగుతోంది. ముఖ్యంగా ఉక్రెయిన్ లోని బఖ్‌ముత్ పట్టణాన్ని ఆక్రమించుకునేందుకు రష్యా బలగాలు ప్రయత్నిస్తున్నాయి. మరోవైపు ఉక్రెయిన్ బఖ్‌ముత్ చేజారిపోకుండా అడ్డుకుంటోంది. ఈ నేపథ్యంలో బఖ్‌ముత్ కేంద్రంగా మారణహోమం జరుగుతోంది. నెలల తరబడి ఈ పట్టణంపై ఆధిపత్యం కనబరిచేందుకు రష్యన్ బలగాలు తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
Belarus President gifts Putin a tractor for 70th birthday: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుక్రవారం 70వ పుట్టినరోజు జరుపుకున్నారు. రష్యా-ఉక్రెయిన్ నేపథ్యంలో రష్యాలో పుతిన్ బర్త్ డే వేడుకలను పెద్దగా జరుపుకోలేదు. అయితే తన బర్త్ డే సందర్భంగా ఒకరు మాత్రం వినూత్నంగా గిఫ్ట్ ఇచ్చారు. ఏకంగా ఓ ట్రాక్టర్ నే గిఫ్టుగా బహూకరించారు. ఆయన ఎవరో కాదు బెలారస్ దేశ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకో. పుతిన్ కు అత్యంత సన్నిహితుడు.
Russia-Ukraine War: రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఆరంభం అయి ఏడు నెలలకు చేరినా.. ఇరు వైపుల దాడులు ఆగడం లేదు. తాజాగా మరోసారి రష్యా, ఉక్రెయిన్ పై విరుచుకుపడింది. సెంట్రల్ ఉక్రెయిన్ లోని డ్నిప్రోపెట్రోవ్స్క్ ప్రాంతంలో రష్యా దాడులు చేసింది. ఈ దాడుల్లో 13 మంది సాధారణ పౌరులు మరణించినట్లు స్థానిక గవర్నర్ వాలెంటివ్ రెజ్నిచెంకో తెలిపారు. రష్యా దాడుల్లో 11 మంది అక్కడిక్కడే మరణించగా.. మరో ఇద్దరు చికిత్స పొందుతూ మరణించారు. జపోరిజ్జియా అణు విద్యుత్…