కూటి కోసం.. కూలి కోసం పట్టణంలో బ్రతుకుదామని వలస వచ్చిన కూలి జనాలకు.. పీడకల లాంటి రోజులు మళ్లీ గుర్తుకొస్తున్నాయి. కరోనా దెబ్బకు గతేడాది లాక్ డౌన్ సమయంలో చిందరవందరైన జీవితం, వారు పడిన కష్టం ఎవరూ మర్చిపోలేదు. సెకెండ్ వేవ్ విజృంభిస్తున్న సమయంలో పలు రాష్ట్రాల్లో మరోసారి లాక్ డౌన్, జనతా కర్ఫ్యూ దిశగా సాగుతుండటంతో…వలస జీవులకు మళ్లీ కష్టాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. మహారాష్ట్ర సహా తెలుగు రాష్ట్రాల నుంచి తట్టాబుట్టా సర్దుకుని సొంతూళ్ల బాట…