Jaiswal vs Gill: టీమిండియా టెస్టు జట్టులో విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఇన్నింగ్స్ 92వ ఓవర్‌ను జైదెన్ సీలెస్ వేశాడు. ఆ ఓవర్ సెకండ్ బంతిని యశస్వీ జైస్వాల్ మిడాఫ్ వైపు కొట్టాడు. ఈజీగా పరుగు వస్తుందని భావించిన యశస్వి రన్నింగ్ చేయడం స్టార్ట్ చేశాడు. మరోవైపు గిల్ మాత్రం అతడి పిలుపును పట్టించుకోకపోవడంతో.. అప్పటికే సగం పిచ్‌కు పైగా దాటిన జైస్వాల్ రిటర్న్ అయ్యేలోపు రనౌట్ అయ్యాడు.
భారత స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ గ్రౌండ్‌లో చిరుతపులిలా పరుగెత్తడం చూస్తూ ఉంటాం. ఫీల్డింగ్ అయినా, వికెట్ల మధ్య అయినా వేగంగా పరుగులు తీస్తాడు. అయితే ఈరోజు చివరి టెస్టులో న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోహ్లీ జోరుకు బ్రేక్ పడినట్లుగా అనిపించింది. ఎందుకంటే.. వికెట్ల మధ్య వేగంగా పరిగెత్తే కోహ్లీ.. రనౌట్ అయ్యాడు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో డైవింగ్ చేసినా వికెట్ కాపాడుకోలేకపోయాడు.
పుణె టెస్టులో భారత జట్టును ఓడించి న్యూజిలాండ్ చరిత్ర సృష్టించింది. భారత్‌లో కివీస్ జట్టు తొలిసారి టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకుంది. 12 ఏళ్లలో 18 సిరీస్‌ల తర్వాత భారత్ సొంతగడ్డపై టెస్టు సిరీస్‌ను కోల్పోయింది. బెంగళూరు టెస్టులో ఓడిపోయిన భారత్.. స్పిన్ ట్రాక్ పైనే ఆడాలని నిర్ణయించుకుంది. ఈ నిర్ణయం టీమిండియాకి ఎంతో నష్టాన్ని మిగిల్చింది. మిచెల్ సాంట్నర్ లాంటి స్పిన్నర్ల ముందు భారత బ్యాటర్లు చేతులెత్తేశారు.
ఐపీఎల్ 2024 క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఎస్ఆర్హెచ్.. ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్ దిగిన ఓపెనర్లు పెద్దగా పరుగులేమీ చేయకుండానే పెవిలియన్‌కు చేరుకున్నారు. ఆ తర్వాత రాహుల్ త్రిపాఠి క్రీజులోకి వచ్చి జట్టు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యత తీసుకున్నాడు.
Rahkeem Cornwall runout in CPL 2023 Video Goes Viral: ప్రస్తుత క్రికెట్ ప్రపంచంలో అత్యంత బరువుగల క్రికెటర్ ఎవరంటే వెంటనే గుర్తొచ్చే పేరు.. ‘రకీమ్ కార్న్‌వాల్’. అతడికి వెస్టిండీస్ భారీకాయుడు, విండీస్ బాహుబలి అని ముద్దు పేర్లు కూడా ఉన్నాయి. అందుకు కారణం.. రకీమ్ ఎత్తు, బరువు. రకీమ్ కార్న్‌వాల్ 6.8 అడుగుల ఎత్తు.. దాదాపుగా 140 కిలోల బరువు ఉంటాడు. రకీమ్ క్రీజులో ఉంటే.. సింగిల్స్ కంటే ఎక్కువగా భారీ షాట్లు ఆడుతుంటాడు.…
After MS Dhoni Run-Out India failed run chase in 2019 World Cup semi-final vs New Zealand: 2019లో భారత్ వన్డే ప్రపంచకప్ సాదిస్తుందని సగటు భారత అభిమాని అనుకున్నాడు. అనుకున్న విధంగానే గ్రూప్ దశలో కోహ్లీ సేన అద్భుతంగా ఆడి.. సెమీస్ చేరింది. కీలక సెమీస్‌లో టాపార్డర్, మిడిలార్డ్ విఫలమైనా.. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ పోరాటంతో గట్టెక్కుతామనే భరోసా కలిగింది. దురదృష్టం రనౌట్ రూపంలో వెక్కిరించడంతో న్యూజిలాండ్ చేతిలో భారత్…
Moen Ali: ఇటీవల భారత్-ఇంగ్లండ్ మహిళా క్రికెట్ జట్ల మధ్య జరిగిన వన్డే మ్యాచ్ వివాదాస్పదంగా మారింది. మూడో వన్డేలో దీప్తి శర్మ ఇంగ్లండ్ బ్యాటర్ చార్లీ డీన్‌ను నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో మన్కడింగ్ అవుట్ చేయడంతో టీమిండియాకు క్రీడా స్ఫూర్తి లేదంటూ ఇంగ్లండ్ మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. తాజాగా ఈ విషయంపై ఇంగ్లండ్ మెన్స్ క్రికెట్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ మాట్లాడాడు. మన్కడింగ్ అవుట్‌ను పూర్తిగా క్రికెట్ చట్టాల నుంచి తీసేసి చట్ట విరుద్ధమని ప్రకటించాలని…
Rohit Sharma: హైదరాబాద్ ఉప్పల్ వేదికగా జరిగిన మూడో టీ20లో టీమిండియా చితక్కొట్టేసింది. అంచనాల మేరకు రాణించి 6 వికెట్ల తేడాతో విజయం సాధించి మ్యాచ్‌తో పాటు సిరీస్ కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో వికెట్ కీపర్ దినేష్ కార్తీక్‌ను కెప్టెన్ రోహిత్ శర్మ ముద్దు పెట్టుకోవడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ మ్యాచ్ 8వ ఓవర్‌లో చాహల్ బౌలింగ్ చేశాడు. ఆ ఓవర్ నాలుగో బంతిని మాక్స్‌వెల్ ఫైన్ లెగ్ దిశగా బాదాడు.…