Rahkeem Cornwall runout in CPL 2023 Video Goes Viral: ప్రస్తుత క్రికెట్ ప్రపంచంలో అత్యంత బరువుగల క్రికెటర్ ఎవరంటే వెంటనే గుర్తొచ్చే పేరు.. ‘రకీమ్ కార్న్‌వాల్’. అతడికి వెస్టిండీస్ భారీకాయుడు, విండీస్ బాహుబలి అని ముద్దు పేర్లు కూడా ఉన్నాయి. అందుకు కారణం.. రకీమ్ ఎత్తు, బరువు. రకీమ్ కార్న్‌వాల్ 6.8 అడుగుల ఎత్తు.. దాదాపుగా 140 కిలోల బరువు ఉంటాడు. రకీమ్ క్రీజులో ఉంటే.. సింగిల్స్ కంటే ఎక్కువగా భారీ షాట్లు ఆడుతుంటాడు. ఎందుకంటే అతడు పరుగెత్తలేడు. సింగిల్స్ తీయడానికి ప్రయత్నిస్తే.. రనౌట్ అయిపోతాడు. ఇది ఎన్నోసార్లు జరిగినా.. తాజాగా కామెడీగా రనౌట్ అయ్యాడు.
వెస్టిండీస్ గడ్డపై ప్రస్తుతం కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) 2023 జరుగుతోంది. గురువారం సెయింట్ లూసియా కింగ్స్, బార్బడోస్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సెయింట్ లూసియా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 201 రన్స్ చేసింది. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ (46), సీన్ విలియమ్స్ (47),, జాన్సన్ చార్లెస్ (30) రాణించారు. బార్బడోస్ రాయల్స్ పేసర్ జాసన్ హోల్డర్ నాలుగు వికెట్స్ తీశాడు.
బార్బడోస్ రాయల్స్ లక్ష్యం 202. దాంతో వెస్టిండీస్ ఆల్ రౌండర్ రకీమ్ కార్న్‌వాల్, ఓపెనర్ కైల్ మేయర్స్ ఓపెనర్లుగా బరిలోకి దిగారు. లక్ష్యం పెద్దది కాబట్టి ఇన్నింగ్స్‌లోని మొదటి బంతి నుంచే షాట్స్ ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది. సెయింట్ లూసియా పేసర్ మాథ్యూ ఫోర్డ్ వేసిన ఇన్నింగ్స్ మొదటి బంతికి కార్న్‌వాల్ లెగ్ సైడ్ భారీ షాట్ ఆడగా.. బంతి బ్యాట్‌కు సరిగ్గా కనెక్ట్ కాలేదు. దాంతో బంతి ఫీల్డర్ వద్దకు వెళ్లగా.. అతడు వదిలేశాడు. దాంతో సింగిల్ కోసం కార్న్‌వాల్ పరుగెత్తాడు. ఫీల్డర్ బంతిని అందుకుని నేరుగా వికెట్లకు గిరాటేశాడు. ఇంకేముంది విండీస్ బాహుబలి రనౌట్ అయ్యాడు.
Also Read: IND vs IRE: తొలిసారి బిజినెస్ క్లాస్ ప్రయాణం.. భావోద్వేగానికి లోనైన టీమిండియా క్రికెటర్!
రకీమ్ కార్న్‌వాల్ రనౌట్‌కు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన ఫాన్స్ కార్న్‌వాల్ పరుగెత్తడం చూసి నవ్వుకుంటున్నారు. అంతేకాదు లైక్స్, కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో బార్బడోస్ రాయల్స్ ఓడిపోయింది. బార్బడోస్ 147 పరుగులకు ఆలౌట్ అవ్వడంతో సెయింట్ లూసియా 54 రన్స్ తేడాతో గెలిచింది.
A Rahkeem Cornwall runout in the CPL. pic.twitter.com/HUfc5Nybhd
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 18, 2023