After MS Dhoni Run-Out India failed run chase in 2019 World Cup semi-final vs New Zealand: 2019లో భారత్ వన్డే ప్రపంచకప్ సాదిస్తుందని సగటు భారత అభిమాని అనుకున్నాడు. అనుకున్న విధంగానే గ్రూప్ దశలో కోహ్లీ సేన అద్భుతంగా ఆడి.. సెమీస్ చేరింది. కీలక సెమీస్‌లో టాపార్డర్, మిడిలార్డ్ విఫలమైనా.. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ పోరాటంతో గట్టెక్కుతామనే భరోసా కలిగింది. దురదృష్టం రనౌట్ రూపంలో వెక్కిరించడంతో న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓడింది. టీమిండియాకు మార్టిన్ గప్టిల్ విలన్‌గా మారడంతో.. 2011 తరువాత ప్రపంచకప్‌ను ముద్దాడే అవకాశం చేజారింది. సరిగ్గా నాలుగు ఏళ్ల క్రితం( 2019 జూలై 10) ఇదే రోజున ధోనీ రనౌట్ కారణంగా యావత్ భారతం శోకసంధ్రంలో మునిగింది.
ప్రపంచకప్ 2019లో భాగంగా జులై 10న మాంచెస్టర్ వేదికగా న్యూజిలాండ్‌తో భారత్ సెమీస్ ఆడింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. వరుణుడు అడ్డంకిగా మారిన ఆ మ్యాచ్ రెండు రోజులు జరిగింది. వర్షం అంతరాయం కలిగించడంతో తొలి రోజు కివీస్ 46.1 ఓవర్లలో 211/5తో నిలిచింది. మరుసటి రోజు మిగిలిన ఓవర్లు పూర్తి చేసిన కివీస్.. 8 వికెట్ల నష్టానికి 239 రన్స్ చేసింది. కేన్ విలియమ్సన్ (67), రాస్ టేలర్ (74) టాప్ స్కోరర్లు. భువనేశ్వర్ 3 వికెట్లు వికెట్స్ పడగొట్టాడు.
Also Read: Rohit Sharma Captaincy: రోహిత్ శర్మ కెప్టెన్సీ నిరాశపర్చింది.. భారత క్రికెట్ దిగ్గజం అసంతృప్తి!
మోస్తరు లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు షాక్ తగిలింది. టాపార్డర్ పూర్తిగా విఫలమైంది. కేఎల్ రాహుల్ (1), రోహిత్ శర్మ (1), విరాట్ కోహ్లీ (1), దినేష్ కార్తీక్ (6) త్వరగానే పెవిలియన్ చేరారు. క్లిష్ట స్థితిలో క్రీజులోకి వచ్చిన ఎంఎస్ ధోనీ (50).. హార్దిక్ పాండ్యా (32)తో కలిసి వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. ఆపై రవీంద్ర జడేజా (77)తో కలిసి ఆచితూచి ఆడుతూ అర్ధ శతకాలతో ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. ధోనీ-జడేజా ఏడో వికెట్‌కు 116 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. ఈ బాగస్వామ్యంతో విజయంపై ఆశలు రేకెత్తాయి. భారత విజయం లాంఛనమే అనుకున్న సమయంలో భారీ షాట్ ఆడబోయిన జడేజా క్యాచ్ ఔట్ అయ్యాడు.
ఎంఎస్ ధోనీ క్రీజులో ఉన్నాడనే భరోసా భారత అభిమానులలో ఉంది. ఇక భారత్ విజయానికి 12 బంతుల్లో 31 పరుగులు అవసరం అయ్యాయి. ధోనీతో సహా భువనేశ్వర్ కుమార్ క్రీజులో ఉన్నాడు. లుకీ ఫెర్గుసన్ వేసిన 49 ఓవర్ మొదటి బంతిని ధోనీ సిక్స్ కొట్టాడు. రెండో బంతికి పరుగులేమీ రాలేదు. మూడో బంతిని షాట్ ఆడిన ధోనీ.. రెండో పరుగుకు యత్నించగా మార్టిన్ గప్తిల్ విసిరిన త్రో బెయిల్స్‌కు తాకింది. ఇంకేముంది ధోనీ పెవిలియన్ చేరాడు. భారత్ ఆశలు గల్లంతయ్యాయి.
Also Read: Bihar: మహిళపై అత్యంత పైశాచికత్యం.. కళ్లు,నాలుక, ప్రైవేట్ పార్ట్స్ కోసి దారుణ హత్య