టీమిండియా కెప్టెన్, రన్ మిషిన్ విరాట్ కోహ్లీకి ఏమైంది ? వరుసగా టెస్టుల్లో ఎందుకు విఫలమవుతున్నాడు ? హాఫ్ సెంచరీ చేసేందుకు ఆపసోపాలు పడుతున్నాడా ? కెప్టెన్‌గా ఒత్తిడిని ఎదుర్కొలేక…బ్యాట్స్‌మెన్‌గా ఫెయిల్ అవుతున్నాడా ? విరాట్ కోహ్లీ…టీమిండియా టాప్ బ్యాట్స్‌మెన్. టెస్టులైనా, వన్డేలైనా, టీ20 మ్యాచులయినా…అద్భుతంగా బ్యాటింగ్ చేయడంతో కోహ్లీకి సాటిరారు. అలాంటి బ్యాట్స్‌మెన్ కొంతకాలంగా బ్యాటింగ్‌లో వరుసగా విఫలమవుతున్నాడు. అర్ధసెంచరీ సాధించేందుకు అష్టకష్టాలు పడుతున్నాడు. చిన్నా పెద్ద టీమ్‌లు అన్న తేడా లేకుండా…భారీ స్కోరు చేయలేక…