ప్రముఖ నిర్మాత ఎ. ఎం. రత్నం సమర్పణలో ఆయన సోదరుడు దయాకర రావు నిర్మాతగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా ‘హరిహర వీరమల్లు’ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఇది సెట్స్ పై ఉండగానే ఎ. ఎం. రత్నం తన కుమారుడి దర్శకత్వంలో మరో సినిమాను ప్రారంభించారు. ‘రూల్స్ రంజన్’ అనే ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్నాడు. శుక్రవారం హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలతో సినీ ప్రముఖుల సమక్షంలో ఈ మూవీ మొదలైంది. ప్రముఖ దర్శకుడు…