మహా శివరాత్రి సందర్భంగా శైవక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు తెలిపారు. 96 శైవ క్షేత్రాలకు వివిధ ప్రాంతాల నుంచి 3,225 బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. గుంటూరు జిల్లా కోటప్ప కొండకు పలు ప్రాంతాల నుంచి 410 బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. కర్నూలు జిల్లా శ్రీశైలంకు పలు ప్రాంతాల నుంచి 390 బస్సులు, కడప జిల్లా పొలతల, నిత్య పూజకోన క్షేత్రాలకు బస్సులు ఏర్పాటు…
సంక్రాంతికి ఏపీఎస్‌ఆర్టీసీ సిద్ధంగా ఉందని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు వెల్లడించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..సంక్రాంతికి 6,970 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని, జనవరి 7వ తేదీ నుంచి 18వ తేదీ వరకూ ఈ ప్రత్యేక బస్సులు నడుస్తాయని ఆయన తెలిపారు. గతంలో కంటే 35% అధికంగా ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంచామని, అదనపు సర్వీసులకు ప్రత్యేకంగా సర్వీస్ కోడ్ ఇచ్చామన్నారు. 9 వేల సిరీస్‌తో సంక్రాంతి స్పెషల్ సర్వీసులు నడువనున్నాయన్నారు. డీజిల్ రేట్లు…