మోరోపంత్ జీవితాన్ని గుర్తు చేస్తూ.. ఒకసారి పింగ్లే చెప్పారు: 75వ సంవత్సరంలో మీకు శాలువా పడితే, అది పదవికి వీడ్కోలు చెప్పే సంకేతంగా భావించాలని పేర్కొన్నారు.. దేశ సేవలో పింగ్లే ఎంత నిబద్ధత చూపించారో, వయస్సు వచ్చినప్పుడు పక్కకు తగ్గిపోవడం ఒక సంస్కారం అని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తెలియజేశారు. ఇక, ఆర్ఎస్ఎస్ చీఫ్ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. భవిష్యత్ రాజకీయ మార్పులకు ఇవి సంకేతమా? అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
తెలంగాణలో విస్తరించేందుకు పావులు కదుపుతోంది ఆర్‌ఎస్‌ఎస్. వచ్చే మూడేళ్లలో 25శాతం గ్రామాల్లో విస్తరించాలని టార్గెట్ పెట్టుకుంది. ప్రజలను తమవైపు తిప్పుకునేందుకు కసరత్తు చేస్తోంది. అందుకు గల అవకాశాలను వినియోగించుకుంటూ సభ్యత్వం పెంచుకోవాలని భావిస్తోంది. దేశవ్యాప్తంగా RSS శాఖలు పెరుగుతున్నాయ్. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది గణనీయంగా పెరిగాయి. ప్రస్తుతం 60 వేల 929 శాఖలు దేశంలో యాక్టివ్‌గా ఉన్నాయ్. తెలంగాణలో కొత్తగా 175 గ్రామాలలో శాఖలు ఈ ఏడాది ప్రారంభమయ్యాయి.2024కి RSS ఏర్పడి వంద సంవత్సాలు…