Rafale-M Jets: భారత నౌకాదళం చేతికి మరో అత్యాధునిక యుద్ధ విమానాలు రాబోతున్నాయి. 26 రఫేల్ మెరైన్ శ్రేణి విమానాలు కొనుగోలు చేసేందుకు ఫ్రాన్స్‌తో భారత్ ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు ఇరు దేశాలకు చెందిన అధికారలు సమక్షంలో సంతకాలు జరిగాయి.
ఫ్రాన్స్‌తో భారత్ బిగ్ డీల్ కుదుర్చుకుంది. రూ. 63,000 కోట్లతో 26 రాఫెల్-ఎం జెట్ల కొనుగోలుకు భారత్ ఆమోదం తెలిపింది. తాజా ఒప్పందంతో భారత నావికాదళానికి 22 సింగిల్-సీటర్, నాలుగు ట్విన్-సీటర్ విమానాలు రానున్నాయని అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి.