కోటప్పకొండ పుణ్యక్షేత్రంలో మహాశివరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. శ్రీ త్రికోటేశ్వర స్వామి దేవాలయం జిల్లాలోనే అత్యంత పురాతన మరియు ప్రసిద్ధ దేవాలయాలలో ఒకటి. మహా శివరాత్రి ఉత్సవాల సందర్భంగా రెండు రోజుల పాటు నిర్వహించే జాతరకు రాష్ట్రం నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు ఆలయాన్ని సందర్శిస్తారు. ఈ ఏడాది దాదాపు 10 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్న అధికారులు అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు. వివిధ గ్రామాల నుంచి వచ్చే ‘ప్రభలు’…