ఐపీఎల్ 2025 మెగా వేలం సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరుగుతున్న విషయం తెలిసిందే. మొదటి రోజు లీగ్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని విధంగా ఆటగాళ్లు భారీ ధర పలికారు. కాగా.. రెండో రోజు వేలం ప్రారంభమైంది. అందులో భాగంగా.. మెగా వేలంలో బౌలర్లు జాక్ పాట్ కొట్టారు. ముఖ్యంగా.. స్టార్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ రూ. 10.75 కోట్లకు అమ్ముడు పోయాడు.