RRR మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రాజమౌళి రూపొందించిన మాగ్నమ్ ఓపస్ ‘ఆర్ఆర్ఆర్’ మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. చిత్ర యూనిట్ అత్యంత దూకుడుగా సినిమాను ప్రమోట్ చేస్తోంది. మీడియాతో తన ఇంటరాక్షన్‌లో రాజమౌళి మాట్లాడుతూ “ఆర్ఆర్ఆర్ ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్. హీరోల ఎంట్రీతో పాటు సినిమా ప్రారంభమైన 20 నిమిషాలకు ఈ రెండు పాత్రలు ప్రదర్శించే ఎమోషనల్ డ్రైవ్‌ను మాత్రమే మీరు చూస్తారు. క్లైమాక్స్ పూర్తిగా భిన్నమైన అనుభూతిని ఇస్తుంది.…