RRR మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రాజమౌళి రూపొందించిన మాగ్నమ్ ఓపస్ ‘ఆర్ఆర్ఆర్’ మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. చిత్ర యూనిట్ అత్యంత దూకుడుగా సినిమాను ప్రమోట్ చేస్తోంది. మీడియాతో తన ఇంటరాక్షన్‌లో రాజమౌళి మాట్లాడుతూ “ఆర్ఆర్ఆర్ ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్. హీరోల ఎంట్రీతో పాటు సినిమా ప్రారంభమైన 20 నిమిషాలకు ఈ రెండు పాత్రలు ప్రదర్శించే ఎమోషనల్ డ్రైవ్‌ను మాత్రమే మీరు చూస్తారు. క్లైమాక్స్ పూర్తిగా భిన్నమైన అనుభూతిని ఇస్తుంది. మీరు సినిమా చూడటం పూర్తవ్వగానే వెంటనే మళ్లీ చూడాలని అనిపిస్తుంది” అంటూ సినిమాపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. అయితే తాజాగా సోషల్ మీడియాలో ‘ఆర్ఆర్ఆర్’ రన్ టైం గురించి ఆసక్తికర బజ్ నడుస్తోంది.
Read Also : Chiranjeevi : సాంస్కృతిక మహోత్సవాలపై స్పెషల్ వీడియో
సెకండాఫ్ కంటే ఫస్టాఫ్ ఎక్కువట. తెలుగు వెర్షన్ దాదాపు 182 నిమిషాలు అంటే 3 గంటల 2 నిమిషాల రన్-టైమ్ తో కొనసాగనున్న విషయం తెలిసిందే. ‘ఆర్ఆర్ఆర్’ ఫస్టాఫ్ 100 నిమిషాల రన్‌టైమ్ (1 గంట 40 నిమిషాలు) ఉండగా, సెకండాఫ్ 82 నిమిషాలు (1 గంట 22 నిమిషాలు) ఉందట. ది. అతని ఆత్మవిశ్వాసానికి వారు ఆశ్చర్యపోతున్నారు. ఇక ఈ సినిమా బుక్ మై షోలో 1.5 మిలియన్ ఇంటెరెస్ట్స్ దాటేసి రికార్డు సాధించింది. ఇంతటి భారీ ఇంటెరెస్ట్స్ సాధించిన తెలుగు సినిమా ఇదే కావడం విశేషం.