వరల్డ్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల ప్రభంజనం సృష్టించిన ఆర్ఆర్ఆర్ సినిమా.. ఇప్పుడు డిజిటల్ వరల్డ్‌లోనూ రికార్డుల పర్వం కొనసాగించేందుకు సిద్ధమవుతోంది. ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ జీ5 ఈ చిత్రాన్ని 20వ తేదీ నుంచి దక్షిణాది భాషల్లో స్ట్రీమ్ చేయనుంది. తొలుత జీ5 సంస్థ పే-పర్-వ్యూ మోడ్‌లో ఈ సినిమాని తీసుకొస్తామని తెలిపింది. ఈ సినిమాకి ఉన్న క్రేజ్‌ని క్యాష్ చేసుకోవాలని, జీ5 ఆ విధానాన్ని అమలుపరచాలనుకుంది. కానీ, ఆడియన్స్ నుంచి భారీఎత్తున తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. పే-పర్-వ్యూ…