మూడో రోజైన నేడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 టోర్నీలో 2 మ్యాచ్ లు జరగనున్నాయి. వీకెండ్ కారణంగా డబుల్ హెడర్ ధమాకా ఉండనుంది. నేడు జరిగే మధ్యాహ్నం మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడున్నాయి. ఇక రాత్రి జరగనున్న గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడున్నాయి. ఈ మ్యాచ్ పై అభిమానులలో విపరీతమైన ఆసక్తి ఉంది. ఈ రెండు మ్యాచ్ ల వివరాలు చూస్తే.. ఐపీఎల్ 2024 సీజన్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 16లో 32వ మ్యాచ్‌లో ఫాఫ్ డు ప్లెసిస్ నేతృత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరియు సంజూ శాంసన్ నేతృత్వంలోని రాజస్థాన్ రాయల్స్ మధ్య ఇవాళ బెంగళూరులోని M చిన్నస్వామి స్టేడియంలో హోరాహోరీ పోరు జరుగనుంది.
బ్యాటింగ్ వైఫల్యంతోనే గెలవాల్సిన మ్యాచ్ లో ఓటమిపాలయ్యామని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అన్నాడు. ఐపీఎల్ 2023 సీజన్ లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ తో బుధవారం జరిగిన మ్యాచ్ లో చెన్నై 3 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన ధోని.. మిడిల్ ఓవర్లలో స్ట్రైక్ రేట్ రొటేట్ చేయడంలో తమ బ్యాటర్లు విఫలమయ్యారని.. ఆ తప్పిదమే తమ ఓటమిని శాసించిందని ధోని చెప్పుకొచ్చాడు.
పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రభ్ సిమ్రన్ సింగ్, రాజస్థాన్ రాయల్స్ ఫినిషర్ ధ్రువ్ జురెల్.. ఈ ఇద్దరూ నిన్న గువహతి వేదికగా జరిగిన మ్యాచ్ లో ఒక్క ప్రదర్శనతో పుల్ ఫేమస్ అయ్యారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వీరి గురించే చర్చ జరుగుతుంది.
సరికొత్త టీమ్ తో ఈ సీజన్ లో అడుగుపెడుతున్నామని సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ భువనేశ్వర్ అన్నారు. మా బౌలింగ్ యూనిట్ చాలా బలంగా ఉంది కెప్టెన్ ల విషయంలో ప్రతీ సీజన్ లో కొంత తడబాటు ఉండేది.. ఈసారి మార్క్రమ్ కెప్టెన్సీ తో SRHకి అదనపు బలం వచ్చింది.. యంగ్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ , నటరాజన్ మా బౌలింగ్ స్ట్రేంత్ పెరిగిందని భువనేశ్వర్ కుమార్ అన్నారు.
ఐపీఎల్ సీజన్ 2022 చివరి దశకు చేరువైంది. ఈ నేపథ్యంలో జట్ల మధ్య పోరు మరింత రసవత్తరంగా మారింది. అయితే.. ఐపీఎల్-2022లో భాగంగా క్వాలిఫైయర్-2లో అహ్మదాబాద్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. అయితే.. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్‌సీబీ ఆదిలోనే విరాట్ కోహ్లి వికెట్ కోల్పోయింది. 7 పరుగులు చేసిన కోహ్లి.. ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో వికెట్…
ఐపీఎల్ 2022లో కోల్ కతాకు రిలీఫ్ లభించింది. వరుసగా ఎదురైన పరాజయాలకు బ్రేక్ పడింది. ఐదు వరుస పరాజయాల తర్వాత ఆ జట్టును గెలుపు వరించింది. సోమవారం రాత్రి రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించి నాలుగో విజయాన్ని నమోదుచేసుకుంది. తొలుత రాజస్థాన్ను 152 పరుగులకు కట్టడి చేసిన కేకేఆర్ ఆ తర్వాత మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి మరో 5 బంతులు మిగిలి ఉండగానే గెలుపు బావుటా ఎగరేసింది. తొలుత…