భారత్ క్రికెట్ జట్టుకు క్రికెటర్లను అందించే కర్మాగారంగా ఉన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్.. ఈ సీజన్ లో మరొ ఇద్దరు స్టార్లను అందజేసింది. ప్రతీ సీజన్ లోనూ కొత్త తారలను పరిచయం చేసే ఈ మెగా క్యాస్ రిచ్ లీగ్.. ఈ ఏడాది ఇద్దరు యువ సంచలనాలను తీసుకొచ్చింది. ఆ ఇద్దరే పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రభ్ సిమ్రన్ సింగ్, రాజస్థాన్ రాయల్స్ ఫినిషర్ ధ్రువ్ జురెల్.. ఈ ఇద్దరూ నిన్న గువహతి వేదికగా జరిగిన మ్యాచ్ లో ఒక్క ప్రదర్శనతో పుల్ ఫేమస్ అయ్యారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వీరి గురించే చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో అసలు ఈ ఇద్దరు ఎవరు అని నెటిజన్స్ ఆరా తీస్తున్నారు. ఐపీఎల్ లో అస్సలు నిలకడ లేని జట్టుగా ఉన్న పంజాబ్ కు చాలాకాలం తర్వాత సిసలైన ఓపెనర్ దొరికాడనే నమ్మకాన్ని ప్రభ్ సిమ్రన్ సింగ్ ఇచ్చాడు. గత మూడు ఎడిషన్లుగా పంజాబ్ జట్టుతో ప్రయాణం చేస్తున్నా.. ఈ సీజన్ లో గుర్తింపు దక్కించుకున్నాడు.
Read Also : MLA Raja Singh: నన్ను అరెస్ట్ చేస్తే జరిగే విధ్వంసాలకు నేను బాధ్యుడిని కాదు
2023 సీజన్ లో భాగంగా పంజాబ్.. కేకేఆర్ తో ఆడిన మొదటి మ్యాచ్ లో ఓపెనర్ గా బరిలోకి దిగి తొలి రెండు ఓవర్లు మొత్తం ఆడి 13 బంతులలో 23 పరుగులు చేసి వెళ్లాడు. ఇక రాజస్థాన్ తో జరిగిన పోరులో అయితే ట్రెంట్ బౌల్ట్, చహల్, అశ్విన్ వంటి అంతర్జాతీయ స్థాయి బౌలర్లను బౌలింగ్ ను చీల్చి చెండాడాడు. 34 బంతుల్లోనే 7 ఫోర్లు, 3 భారీ సిక్సర్లతో 60 పరుగులు సాధించాడు. ప్రభ్ సిమ్రన్ సింగ్ ఆడుతున్నంసేపూ మరో ఎండ్ లో ఉన్న దిగ్గజ ఓపెనర్ శిఖర్ ధావన్.. ఏదో హీరోకు బ్రదర్ రోల్ పోషించినట్లుగా ఉండిపోయాడు. అంటే ఈ మ్యాచ్ లో అతడి ప్రభావం ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పంజాబ్ లోని పాటియాలకు చెందిన ఈ కుర్రాడు.. 2018లో దేశవాళీలో అరంగేట్రం చేశాడు. గతేడాది మొదటి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడిన ప్రభ్ సిమ్రన్ 11 మ్యాచ్ లలో 689 పరుగులు చేశాడు. 24 లిస్ట్ ఏ మ్యాచ్ లో 664 రన్స్ చేశాడు. ఐపీఎల్ లో పంజాబ్ తరపున 2020 నుంచి ఉంటున్నా పెద్దగా తన ప్రతిభను చాటే అవకాశం రాలేదు. ఈ మ్యాచ్ కు ముందు వరకూ పెద్దగా పరిచయం లేని ఈ పాటియాలా కుర్రాడు.. ఒక్క మ్యాచ్ తో తన పేరును మార్మోగేలా చేసుకున్నాడు.
Read Also : RGV: రేపు నా బర్త్ డే, ఎవరూ విష్ చేయకండి రా.. బాబు
ఇక నిన్నటి మ్యాచ్ లోనే వెలుగులోకి వచ్చిన మరో ఆణిముత్యం ధ్రువ్ చంద్ జురెల్.. ఈ కుర్రాడికి ఐపీఎల్ లో నిన్నటి మ్యాచే ఫస్ట్ ది. బరిలోకి దిగిన సందర్బమేమీ ఆషామాషీది కాదు.. 198 పరుగుల లక్ష్య ఛేధనలో రాజస్థాన్.. 15 ఓవర్లలో 125 పరుగులే చేసి ఆరు కీలక వికెట్లు కోల్పోయింది. క్రీజులో షిమ్రన్ హెట్మెయర్ ఒక్కడే పేరున్న బ్యాటర్.. రాజస్థాన్ భారీ ఓటమి తప్పదనుకున్నారంతా.. కానీ ఈ మ్యాచ్ లో రాజస్థాన్ ను విజయపు అంచుల వరకూ తీసుకెళ్లిన ఘనత ధ్రువ్ దే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. చివరి రెండు ఓవర్లలో 34 పరుగులు చేయాల్సి ఉండగా.. అర్ష్ దీప్ వేసిన 19వ ఓవర్లో ధ్రువ్.. 4,6,4తో రాజస్థాన్ శిభిరంలో ఆశలు రేపాడు. ఇంపాక్ట్ ప్లేయర్( చహల్ స్థానంలో ) బరిలోకి దిగిన ధ్రువ్.. 15 బంతుల్లోనే 3 ఫోర్లు.. 2 భారీ సిక్సర్ల సాయంతో 32 రన్స్ చేశాడు. ఉత్తరప్రదేశ్ కు చెందిన జురెల్.. వికెట్ కీపర్.. బ్యాటర్ 22 ఏళ్ల జురెల్.. భయం లేకుండా ఆడగలడని నిన్నటి మ్యాచ్ చూస్తేనే అర్థమవుతున్నది. ఇప్పటి వరకు 11 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడిన ధ్రువ్.. 587 పరుగులు చేశాడు. నాలుగు టీ20 మ్యాచ్ లలో 60 పరుగులు సాధించాడు గతేడాది విదర్భతో యూపీ మ్యాచ్ సందర్భంగా ఎంట్రీ ఇచ్చిన ధ్రువ్.. గతంలో భారత్ అండర్-19 టీమ్ తో పాటు ఇండియా-ఏకు ప్రాతినిధ్యం వహించాడు. ఈ సీజన్ కు ముందు నిర్వహఇంచిన వేలంలో రాజస్థాన్ రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది.