ఐపీఎల్ 2025లో భాగంగా.. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం సాధించింది. 50 పరుగుల తేడాతో ఆర్సీబీ గెలుపొందింది. 197 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన సీఎస్కే బ్యాటర్లు తడబడ్డారు. 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసింది.
మ్యాచ్‌లో ఓ కీలక ఘట్టం మతిష పతిరానా వేసిన బౌన్సర్ కారణంగా చోటుచేసుకుంది. విరాట్ కోహ్లీ ఈ బౌన్సర్‌ను భారీ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బంతి బ్యాట్‌కు తాకిన తర్వాత హెల్మెట్‌కు తాకింది. ఇది చూసి స్టేడియంలో ఉన్న అభిమానులు కాస్త భయాందోళనకు గురయ్యారు. అయితే.. కోహ్లీ కొంత సమయం తర్వాత మళ్లీ ఆట కొనసాగించాడు. ఈ క్రమంలో.. పతిరానా మరో బౌన్సర్ వేయగా, కోహ్లీ ఆ బంతిని ఫైన్ లెగ్ వైపు సిక్స్‌గా…
చెన్నై సూపర్ కింగ్స్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్ 2025లో వికెట్ల వెనుక చాలా చురుగ్గా కనిపిస్తున్నాడు. చెపాక్ మైదానంలో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ధోని చిరుతపులి వేగంతో ఫిల్ సాల్ట్‌ను స్టంప్ చేసి సీఎస్కేకు కీలకమైన బ్రేక్ అందించాడు.
ఐపీఎల్ 2025లో భాగంగా.. ఈరోజు హైఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. చెన్నైలోని MA చిదంబరం స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఆసక్తికర పోరు ఉండనుంది. ఈ క్రమంలో.. టాస్ గెలిచిన సీఎస్కే ఫీల్డింగ్ ఎంచుకుంది.
ఐపీఎల్ 2025లో భాగంగా.. కాసేపట్లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య మ్యాచ్ జరగనుంది. చెన్నైలోని MA చిదంబరం స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
ఐపీఎల్ 2025 అట్టహాసంగా ప్రారంభమైంది. ఐపీఎల్ 18వ సీజన్ సందడి చేస్తోంది. క్రికెట్ ఫ్యాన్స్ కు ఫుల్ జోష్ అందిస్తోంది. ఈ సీజన్ లో భాగంగా తొలి మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్ కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగింది. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ విజయదుందుభి మోగించింది. ఐపీఎల్ 18వ సీజన్ లో ఆర్సీబీ బోణీ కొట్టింది. 7 వికెట్ల తేడాతో కోల్ కతాపై ఆర్సీబీ ఘన విజయం సాధించింది.…
మరి కొన్ని నిమిషాల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 ఘనంగా ప్రారంభం కానుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ప్రారంభ మ్యాచ్ జరగడం ఇది రెండోసారి. టోర్నమెంట్ మొదటి సీజన్ 2008లో ఈ రెండు జట్లు తలపడ్డాయి. అప్పుడు కేకేఆర్ భారీ తేడాతో గెలిచింది. 2008 ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో బ్రెండన్ మెకల్లమ్ కేకేఆర్ తరఫున 158 పరుగుల తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు.
ఐపీఎల్ 2025 మొదటి మ్యాచ్ ఈరోజు (మార్చి 22, శనివారం) కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరగనుంది. 18వ సీజన్.. కోల్‌కతా నైట్ రైడర్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌తో ప్రారంభమవుతుంది. అయితే.. వర్షం అభిమానుల ఉత్సాహాన్ని క్షీణింపజేస్తోంది. గత రెండు రోజులుగా కోల్‌కతాలో ఆరెంజ్ అలర్ట్ అమలులో ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన యాంటీ సైక్లోనిక్ ప్రసరణ కారణంగా మార్చి 22 వరకు కోల్‌కతాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 ప్రారంభ మ్యాచ్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో సాయంత్రం 7.30 గం.కు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్లు తలపడనున్నాయి.
ఆర్సీబీపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ పాయింట్ల పట్టికలో ఆర్సీబీ ఈసారి అట్టడుగున నిలుస్తుందని జోస్యం చెప్పారు. ఆర్సీబీ అంటే తనకేమీ ద్వేషం లేదని.. కోహ్లీకి కూడా తానెప్పుడూ వ్యతిరేకం కాదన్నారు.