Avesh Khan Reprimanded For Aggressive Celebration: తమ జట్టు గెలిచినప్పుడు.. ఏ ఆటగాడైనా ఆనందంతో ఎగిరి గంతులేస్తాడు. తమ జట్టు సభ్యులతో కలిసి మైదానంలోనే సెలెబ్రేషన్స్ చేసుకుంటాడు. కానీ.. కొందరు మాత్రం ఆ ఆనందంలో శృతిమించి ప్రవర్తిస్తారు. నిబంధనల్ని అతిక్రమించి.. ఓవరాక్షన్ చేస్తారు. అలా చేస్తే.. ఆయా ఆటగాళ్లకు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇప్పుడు అవేశ్ ఖాన్‌కి అదే పరిస్థితి వచ్చిపడింది. చివర్లో తాను కొట్టకుండానే తీసిన పరుగు (బై)తో జట్టు విజయం సాధించిందన్న ఆనందంలో అతడు తన హెల్మెట్‌ని తీసి, నేలకు విసిరికొట్టాడు. దీంతో.. అతనికి ఐపీఎల్ నిర్వాహకులు మొట్టికాయలు వేశారు.
Salman Khan: సల్మాన్ ఖాన్‌కి మరో బెదిరింపు.. ఏప్రిల్ 30న చంపేస్తాం
ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా సోమవారం లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే! చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో లక్నో విజయం సాధించింది. అయితే.. చివర్లో ఒక బంతికి ఒక పరుగు కొట్టాలన్నప్పుడు అవేశ్ ఖాన్ క్రీజులోకి వచ్చాడు. హర్షల్ పటేల్ వేసిన చివరి బంతిని అతడు కొట్టలేదు కానీ, కీపర్ వైపుకు దూసుకుపోవడంతో బ్యాటర్లు పరుగు తీశారు. దీంతో.. బై రూపంలో పరుగు రావడంతో లక్నో గెలుపొందింది. ఈ నేపథ్యంలో లక్నో ఆటగాళ్ల సంబరాలు అంబరాన్నంటాయి. అందరూ మైదానంలోకి దూసుకొచ్చారు. అయితే.. అవేశ్ కాన్ మాత్రం మరీ దూకుడుగా ప్రవర్తించాడు. తానేదో చివరి బంతికి సిక్స్ కొట్టి గెలిపించినంత ఓవర్‌గా బిహేవ్ చేస్తూ.. హెల్మెట్ నేలకేసి కొట్టి, వైల్డ్‌గా సెలబ్రేట్ చేసుకున్నాడు. దీంతో.. ఐపీఎల్ నిర్వాహకులు అతనికి గట్టి వార్నింగ్ ఇచ్చారు.
Beautician Cheated: బ్యూటీషియన్‌కి టోకరా.. లాభమని చెప్పి నిండా ముంచేశారు
మైదానంలో మితిమీరి ప్రవర్తించడంతో.. అవేశ్ ఖాన్ ‘ప్రవర్తనా నియమావళిని’ ఉల్లంఘించాడని ఐపీఎల్ నిర్వహకులు పేర్కొన్నారు. అతడు ఐపీఎల్ కోడ్‌లోని 2.2 నిబంధనను అతక్రమించాడని, అందుకు అతనికి మందలింపుగా ఈ ప్రకటన విడుదల చేయడం జరుగుతోందని వారు తెలిపారు. ఇది మొదటి తప్పిదం కావడంతో మందలింపుతో సరిపెడుతున్నట్టు వెల్లడించారు. అంటే.. ఇంకోసారి ఇలాగే ఓవర్‌గా ప్రవర్తిస్తే మాత్రం, అవేశ్ ఖాన్‌కి అప్పుడు భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వస్తుంది.