CSK Scored 226 Runs In 20 Overs Against RCB: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు హోమ్ గ్రౌండ్ అయిన ఎం. చిన్నస్వామి స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లు దంచికొట్టారు. ఎడాపెడా షాట్లతో బౌండరీల వర్షం కురిపించారు. డెవాన్ కాన్వే (83), శివమ్ దూబే (52) అర్థశతకాలతో శివాలెత్తగా.. అజింక్యా రహానే (37) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. వీరితో పాటు ఇతర బ్యాటర్లు సైతం తమవంతు సహకారం అందించారు. దీంతో.. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి చెన్నై జట్టు 226 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ గెలుపొందాలంటే.. ఆర్సీబీ జట్టు 227 పరుగులు సాధించాలి. చెన్నై జట్టు ఎలాగైతే చెలరేగి ఆడిందో, అలాగే ఆర్సీబీ తాండవం చేయాలి. మరి.. ఇంత భారీ లక్ష్యాన్ని ఆర్సీబీ ఛేజ్ చేయగలుగుతుందా?
Amarnath Yatra : అమర్‌నాథ్ యాత్రకు రిజిస్ట్రేషన్ షురూ.. ఫీజుల వివరాలు ఇవే..
తొలుత చెన్నై సూపర్ కింగ్స్‌కి రుతురాజ్ గైక్వాడ్ వికెట్ రూపంలో భారీ షాకే తగిలింది. అతడు మూడు పరుగులకే సిరాజ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. కానీ.. ఎప్పుడైతే రహానే మైదానంలోకి అడుగుపెట్టాడో, అప్పటినుంచి ఒకటే బాదుడు మొదలైంది. వచ్చీరాగానే రహానే షాట్లు కొట్టడం చూసి, కాన్వే సైతం చెలరేగిపోయాడు. ఇద్దరు కలిసి ఆర్సీబీ బౌలర్లకు ముచ్చెమటలు పట్టించారు. అయితే ఫోర్ లేదా సిక్స్.. బ్యాట్ ఎత్తితే చాలు బౌండరీలే. రహానే ఔటయ్యాక శివమ్ దూబే కూడా శివాలెత్తాడు. 27 బంతులకే 52 పరుగులు చేశాడంటే.. ఎలా విజృంభించాడో అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత వరుసగా వికెట్లు పడినా.. వచ్చిన వాళ్లు తమవంతు పరుగులు కొట్టారే తప్ప, బంతుల్ని వృధా చేయలేదు. అందుకే.. చెన్నై అంత భారీ స్కోరు చేయగలిగింది.
Hyd Rains : హైదరాబాద్‌లో భారీ వర్షం.. మరో మూడు రోజులు వర్ష సూచన
నిజానికి.. మొదట్లో ఆర్సీబీ బౌలర్లు వేసిన కట్టుదిట్టమైన బౌలింగ్ చూసి, చెన్నై బ్యాటర్లకు చుక్కలు చూపిస్తారని అనుకున్నారు. కానీ.. అందుకు రివర్స్‌లో పరిణామాలు చోటు చేసుకున్నాయి. సిరాజ్ కంట్రోల్ చేయడానికి బాగానే ప్రయత్నించాడు కానీ.. మిగతా బౌలర్లే ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. కంట్రోల్ చేసేందుకు కనీసం ప్రయత్నించలేదు. గల్లి క్రికెట్‌లో వేసే బౌలింగ్ కన్నా ఘోరంగా బౌలింగ్ వేశారు. సీఎస్కే ఇంత స్కోరు కొట్టడంలో (సిరాజ్ మినహాయించి) బౌలర్లదే వైఫల్యం అని చెప్పుకోవచ్చు.