ఇటీవల కన్నుమూసిన మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ రోశయ్య కుటుంబాన్ని పరామర్శించారు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు. హైదరాబాద్‌లోని రోశయ్య నివాసానికి వెళ్ళారు వెంకయ్యనాయుడు. రోశయ్యతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. రోశయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన సేవల్ని కొనియాడారు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు. రోశయ్య కుటుంబసభ్యులతో మాట్లాడి, ధైర్యం చెప్పారు. రోశయ్య, నేను ఒకేసారి సీఎంలుగా పనిచేశాం. తమిళనాడు గవర్నర్ గా పనిచేసినప్పుడు ఆయనతో అనుబంధం ఉంది. ఆయన సేవలు మరువలేనివి. వారు నాకు…
సుదీర్ఘ ప్రజా జీవితంలో మచ్చలేని మహోన్నత నాయకుడు కొణిజేటి రోశయ్య. ఆయన మరణంతో రాజకీయాలలో ఒక శకం ముగిసింది. వివాద రహితులుగా, నిష్కళంకితులుగా అందరి మెప్పు పొందిన గొప్ప నేత. నేటి తరం నేతలకు ఆయన ఆదర్శప్రాయుడు. ప్రత్యేకమైన ఆయన కంఠాన్ని తెలుగు ప్రజలు మరిచిపోలేరు. నేటి రాజకీయ నేతల తీరుచూస్తున్నాం… విమర్శలకు తిట్లకు తేడా లేదు. నేతలు కావాలని వివాదాలు సృష్టించుకుంటున్న రోజులు ఇవి. రోశయ్య నిబద్ధత, క్రమశిక్షణ చూసి వారు ఎంతో నేర్చుకోవాల్సి వుంది.…