దేశంలోనే రోల్ మోడల్ గా తెలంగాణ మారిపోతోందన్న అక్కసుతోనే ప్రధాని మోడీ వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి. సంగారెడ్డిలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి బీజేపీ నేతలపై మండిపడ్డారు. కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేయడానికి దారి తీసిన కారణాల్లో సంగారెడ్డి జిల్లాలోని పరిస్థితులు ఒకటన్నారు. రూ 4400కోట్లతో 4.5లక్షల ఎకరాలకు సాగు నీరు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సంగారెడ్డికి వచ్చిన కేసీఆర్ మెడికల్ కాలేజీ…