(సెప్టెంబర్ 16న నటి రోజారమణి పుట్టినరోజు)ఎదురుగా యస్వీ రంగారావు వంటి భారీ విగ్రహం ఉన్న మహానటుడు భయపెట్టే హిరణ్యకశ్యపునిగా నటిస్తున్నా, అదరక బెదరక పసిప్రాయంలోనే భళా అనిపించేలా భక్త ప్రహ్లాదలో నటించారు రోజారమణి. ఆ చిత్రంలో ఆమె నటనకు బాలనటిగా జాతీయ అవార్డు లభించాల్సిందే. అప్పటికి ఇంకా జాతీయ అవార్డుల్లో ఉత్తమ బాలనటుల విభాగం ఏర్పాటు చేయలేదు. ఆ తరువాతి సంవత్సరం నుంచీ ఆ కేటగిరీ మొదలయింది. అయితే, రోజారమణి భక్త ప్రహ్లాదునిగా నటించిన చిత్రాన్ని నాటి…