మరపురాని రోజారమణి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
(సెప్టెంబర్ 16న నటి రోజారమణి పుట్టినరోజు)
ఎదురుగా యస్వీ రంగారావు వంటి భారీ విగ్రహం ఉన్న మహానటుడు భయపెట్టే హిరణ్యకశ్యపునిగా నటిస్తున్నా, అదరక బెదరక పసిప్రాయంలోనే భళా అనిపించేలా భక్త ప్రహ్లాదలో నటించారు రోజారమణి. ఆ చిత్రంలో ఆమె నటనకు బాలనటిగా జాతీయ అవార్డు లభించాల్సిందే. అప్పటికి ఇంకా జాతీయ అవార్డుల్లో ఉత్తమ బాలనటుల విభాగం ఏర్పాటు చేయలేదు. ఆ తరువాతి సంవత్సరం నుంచీ ఆ కేటగిరీ మొదలయింది. అయితే, రోజారమణి భక్త ప్రహ్లాదునిగా నటించిన చిత్రాన్ని నాటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ ప్రత్యేకంగా ప్రదర్శన వేయించుకొని తిలకించారు. రోజారమణి ఆ సినిమాలో ఏనుగులు, పాములతో ఏ మాత్రం బెదరకుండా నటించడం చూసి ఆయన ముగ్ధులయ్యారు. అలా రాష్ట్రపతి ప్రశంసా పత్రం రోజారమణికి సొంతమయింది. ఆ తీరున ప్రత్యేకంగా అవార్డు పొందిన బాలనటి కానీ, బాలనటుడు కానీ మరొకరు కానరారు. తరువాతి రోజుల్లో పలు చిత్రాలలోనూ బాలనటిగా రోజారమణి ఆకట్టుకున్నారు. ఆ రోజుల్లో రోజారమణి స్టార్ కిడ్ అని చెప్పవచ్చు. తరువాతి రోజుల్లో ముగ్ధమనోహరంగా నాయిక పాత్రల్లో మురిపించారు. అయితే ఎక్కువగా ఆమెకు హీరోల చెల్లెళ్ల పాత్రలే లభించేవి. దాంతో రోజారమణి అనగానే అందాల చెల్లెలు అనే ముద్ర పడిపోయింది. దక్షిణాది అన్ని భాషల్లోనూ రోజారమణి తనదైన నటనతో ఆకట్టుకున్నారు. ఇక ఒరియా భాషలో మాత్రం స్టార్ హీరోయిన్ స్టేటస్ సాధించారు రోజారమణి.
ఇప్పటికీ రోజారమణి పేరు తలచుకోగానే ఆ నాటి ప్రేక్షకులకు 1967లో భక్త ప్రహ్లాదలో ఆమె నటించిన తీరు గుర్తుకు వస్తుంది. తరువాత సత్యకాలపు సత్తెయ్య వంటి చిత్రాలు స్ఫురిస్తాయి. తాతమ్మకల, జేబుదొంగ, రామ్-రహీమ్, బలిపీఠం, మొనగాడు, డ్రైవర్ రాముడు వంటి చిత్రాల్లోని చెల్లెలి పాత్రలూ మెదలుతాయి. కె.విశ్వనాథ్ తెరకెక్కించిన ఓ సీత కథ, బి.ఎస్. ఆంజనేయులు దర్శకత్వం వహించిన కన్నెవయసు వంటి చిత్రాలలో నాయికగానూ అలరించారు రోజారమణి. సింగీతం శ్రీనివాసరావు రూపొందించిన సొమ్మొకడిది-సోకొకడిది చిత్రంలో కమల్ హాసన్ ద్విపాత్రాభినయం చేయగా, ఓ కమల్ కు జోడీగా నటించారు. మళయాళ చిత్రాలలో నాయికగానూ అలరించారు. నటుడు చక్రపాణిని ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. వీరిద్దరూ ఒరియా చిత్రాలలో జోడీగా నటించి ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ఒరియాలో వీరిద్దరూ సీతారాములుగా నటించిన సీతాలవకుశ మంచి విజయం సాధించింది. దాంతో భార్యాభర్తలిద్దరికీ స్టార్ స్టేటస్ లభించింది. పిల్లలు పుట్టిన తరువాత రోజారమణి నటనకు దూరంగా జరిగారనే చెప్పాలి. ఏదో ఒకటి రెండు చిత్రాలలో నటించారంతే! అయితే ఎంతోమంది నాయికలకు ఆ రోజుల్లో రోజారమణి గాత్రదానమే వారి నటనకు ప్రాణం పోసింది. దాదాపు 400పైగా చిత్రాలకు రోజారమణి డబ్బింగ్ చెప్పారు.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
బ్లూ క్రాస్ సంస్థలో కీలకంగా ఉంటూ, జంతుసంరక్షణలో తనవంతు పాత్ర పోషిస్తున్నారు రోజారమణి. ఆమె తనయుడు తరుణ్ కూడా తల్లి బాటలో బాలనటునిగా భలేగా మెప్పించారు. నువ్వేకావాలితో యంగ్ హీరోగానూ తరుణ్ జనం ముందు నిలచి వారి మనసులు గెలిచారు. రోజారమణి, చక్రపాణి దంపతులకు అమూల్య అనే కూతురు కూడా ఉన్నారు. ఏది ఏమైనా తెలుగు చిత్రసీమలో తనకంటూ ఓ చెరిగిపోని స్థానం సంపాదించారు రోజారమణి.
తాజావార్తలు
-
Punjab Drug Menace: నడవలేక తూలిపడిన 19 ఏళ్ల యువతి.. ‘జాంబీ డ్రగ్’పై మళ్లీ ఆందోళనలు.. పోలీసుల యాక్షన్
-
CJP Protest: సీజేపీ నిరసనలో తీవ్ర విషాదం.. ప్రొటెస్ట్‌కు వచ్చిన వ్యక్తి మృతి..
-
India vs Pakistan: నేడే భారత్-పాకిస్థాన్ గోల్డ్ మెడల్ ఫైట్.. ఎవరి బలం ఎంత? పూర్తి విశ్లేషణ ఇదే..!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..