టీమిండియా క్రికెటర్లు ఆమిర్ ఖాన్ ను ఫన్నీగా ట్రోల్ చేశారు. రోహిత్ శర్మ స్పందిస్తూ.. సినిమాలో క్రికెట్ ఆడినంత మాత్రానా క్రికెటర్ అయిపోడు.. ఒక హిట్ సినిమాకు రెండేళ్లు తీసుకుంటే హిట్ మ్యాన్ లు అయిపోలేరు.. అంటూ ట్రోల్ చేశాడు.
బీసీసీఐలో ఉన్న చాలామందిక కూడా జస్ప్రిత్ బుమ్రా గాయం స్టేటస్ గురించి తెలీదు. కేవలం ఎస్సీఏ డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్ మాత్రం బుమ్రాని స్పెషల్ గా పర్యవేక్షిస్తున్నాడు.
కెప్టెన్ అయ్యుండి.. అతను ఇలా మాటిమాటికి సెలవులు తీసుకోవడం ఏం బాగోలేదు.. అంటూ సునీల్ గవాస్కర్ అన్నారు. వరల్డ్ కప్ ఉంటే.. బామ్మర్ది పెళ్లికి వెళ్లకూడదా.. ప్రతీ ఒక్కరికీ కుటుంబ బాధ్యతులు కూడా ఉంటాయని రోహిత్ శర్మ కౌంటర్ ఇచ్చాడు.
బీసీసీఐ ఆటగాళ్ల ఫిట్ నెస్ పై ఫోకస్ చేసిందని చెప్పారు. కానీ ఆటగాళ్ల ఫిట్ నెస్ ను దృష్టిలో ఉంచుకుని ఆయా జట్లు యాజమాన్యాలు నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని రోహిత్ శర్మ పేర్కొన్నాడు.
తొలి రెండు వన్డేల్లో గోల్డన్ డక్ గా వెనుదిరిగిన స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ కు మరో అవకాశం ఇవ్వాలని జట్టు మెనెజ్మెంట్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.