ఐపీఎల్ 16వ సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ఇందులో భాగంగా నేడు ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతోంది. అయితే.. ఐపీఎల్-2023 సీజన్‌లో జరుగుతున్న 31వ మ్యాచ్ ఇది. ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో ముంబై జట్టు పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంటే, పంజాబ్ జట్టు ఏడో స్థానంలో ఉంది. ఇరు జట్లకూ ఆరేసి పాయింట్లు ఉన్నాయి. రన్ రేట్ ముంబైకి ఎక్కువగా ఉంది. అయితే.. టాస్ గెలిచిన రోహిత్ శర్మ ఫీల్డింగ్ తీసుకున్నాడు.
Also Read : Sabitha Indrareddy: తెలంగాణకు ఏం చేశారని చేవెళ్లలో సభ పెడుతుండ్రు..
అయితే.. టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. 215 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన ముంబయి జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. అర్ష్‌దీప్ సింగ్ రెండో ఓవర్‌ను వేయగా… తొలి బంతికే ఇషాన్ కిషన్‌ను ఔట్ చేశాడు. షాట్ ఆడేందుకు యత్నించిన ఇషాన్ కిషన్(1) మాథ్యూ షాట్ చేతికి చిక్కాడు. దీంతో 8 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది ముంబయి. పవర్ ప్లే ముగిసే సరికి.. ఆరో ఓవర్‌ను నాథన్ ఎల్లిస్ వేశాడు. పవర్ ప్లే ముగిసే సరికి ముంబయి 54 పరుగులు చేసింది. 9వ ఓవర్ లియామ్ లివింగ్‌స్టోన్ వేయగా.. మూడో బంతిని అతడికే క్యాచ్ ఇచ్చి రోహిత్ శర్మ(44) పెవిలియన్ చేరాడు. అయితే.. పది ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి ముంబయి 88 పరుగులు చేసింది. క్రీజులో సూర్యకుమార్ యాదవ్ (1), కామెరూన్ గ్రీన్(39) ఉన్నారు.