టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కీలక సూచన చేశాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కోసం రోహిత్ శర్మ విశ్రాంతి తీసుకోవాలని సూచించాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం రెడీ అయ్యేందుకు రోహిత్ శర్మ ఐపీఎల్ నుంచి బ్రేక్ తీసుకోవాలని వెల్లడించారు. కావాలంటే ఐపీఎల్ చివరి మ్యాచ్ లకు మళ్లీ రావాలని పేర్కొన్నాడు. ఇప్పుడైతే అతడికి కాస్త విశ్రాంతి అవసరం అని సునీల్ గవాస్కర్ సూచించారు. ఇక ఇండియా-ఆస్ట్రేలియా మధ్య జూన్ 7 నుంచి లండన్‌లోని ఓవల్‌లో జరిగే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో తలపడనున్నాయి. ఆరోన్ ఫించ్‌తో కలిసి స్టార్ స్పోర్ట్స్ షోలో సునీల్ గవాస్కర్
పాల్గొన్నప్పుడు ఈ వ్యాఖ్యలు చేశాడు.
Also Read : NTR : ఎన్టీఆర్‌తో వర్క్ చేయాలని ఉందంటున్న హాలీవుడ్ డైరెక్టర్
డబ్య్లూటీసీ ఫైనల్ మ్యాచ్ లో భారతదేశం టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంటే, వారు మొదటి ఇన్నింగ్స్‌లో మాత్రమే బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది అని గవాస్కర్ అన్నారు. నేను ఆస్ట్రేలియాను మొదట బ్యాటింగ్ చేయడానికి భారత్ కి సపోర్ట్ ఇస్తున్నాట్లు సన్నీ వెల్లడించారు. ఎందుకంటే ఆస్ట్రేలియా ప్లేయర్లు చూసుకుంటే.. భారత బ్యాటింగ్ లైనప్‌ను పరిశీలిస్తే, 8వ స్థానంలో మనకు (రవిచంద్రన్) ఐదు టెస్టు సెంచరీలు చేసిన అశ్విన్ ఉన్నారు అని ఆయన పేర్కొన్నాడు. అలాగే ఓవల్ సాధారణంగా బ్యాటింగ్ చేయడానికి చాలా మంచి పిచ్. ఆసీస్ టాస్ గెలిచి, మొదటి రెండు రోజుల్లో భారీ స్కోరు నమోదు చేసిన.. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ కు బ్యాటింగ్ చేయాల్సిన అవసరం లేకుండా భారత్ జట్టు చేస్తుందని సునీల్ గవాస్కర్ చెప్పుకొచ్చారు.
Also Read : BJP MP Rajveer singh : బీజేపీ ఎంపీకి దోమలు కుట్టాయని ట్రైన్ ను ఆపేసిన అధికారులు
మరోవైపు ఆస్ట్రేలియన్ ఆటగాడు ఆరోన్ ఫించ్ భారత్‌ను ఔట్ చేయడానికి తమ దేశస్థులకు మద్దతు ఇచ్చాడు. జూన్‌లో ఓవల్ వికెట్ స్పిన్ కు అనుకూలంగా ఉంటుందని ఆయన అన్నారు. అందుకే నేను దీనిని గెలవడానికి ఆస్ట్రేలియాకు మద్దతు ఇస్తున్నాను” అని అతను చెప్పాడు. IPL క్రికెట్ నుంచి టెస్ట్ మ్యాచ్ క్రికెట్‌కు వెళ్లడం సమస్య కాదా అని హోస్ట్ అడిగినప్పుడు.. రెండు వైపుల ఆటగాళ్లు చాలా అనుభవం ఉన్నందున ఇది పెద్ద సమస్య కాదని గవాస్కర్ అన్నారు. పరిస్థితులకు అలవాటు పడాలంటే ముందుగా ఇంగ్లండ్‌కు వెళ్లాలని ఆటగాళ్లకు సలహా ఇచ్చాడు. ఐపీఎల్ మే 28న ముగుస్తుందని, జూన్ 7న టెస్టు మొదలవుతుందని నాకు తెలుసు. ఇంగ్లండ్‌కు వెళ్లేందుకు కాస్త ముందుగా అర్హత సాధించని జట్లలోని ఆటగాళ్లను చూడాలనుకుంటున్నాను, బహుశా క్లబ్‌లతో కూడా ఆడవచ్చు. పరిస్థితులకు తగ్గట్టుగా వారికి ఇది దోహదపడుతుంది’ అని సునీల్ గవాస్కర్ అన్నారు. గత నెలలో ఇండోర్‌లో ఆస్ట్రేలియా తొమ్మిది వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించి ఫైనల్‌కు చేరుకుంది. అయితే 2021లో జరిగిన తొలి WTC ఫైనల్ మ్యాచ్ లో భారత్‌ను న్యూజిలాండ్ టీమ్ ఓడించింది.