వరల్డ్ కప్ 2023 ఫైనల్ లో ఆస్ట్రేలియా ఆరోసారి కప్ ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలో స్వదేశంలో జరుగుతున్న వరల్డ్ కప్ పై అభిమానులతో పాటు.. ఇటు ఆటగాళ్లు కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఉండి.. టైటిల్ మ్యాచ్ లో ఓడిపోవడంతో టీమిండియా ఆటగాళ్లు కన్నీటిపర్యంతం అయ్యారు.
ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంలో ఆస్ట్రేలియా బౌలర్లను ఎదుర్కోవడంలో టీమిండియా విఫలమయ్యారని సునీల్ గవాస్కర్ అన్నారు. స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. “రోహిత్ శర్మ ఓ తప్పుడు షాట్ ఆడి అవుట్ కావడం పెద్దదెబ్బ అన్నారు.
ప్రపంచకప్ ఫైనల్ ప్రారంభమైన వెంటనే కెప్టెన్‌గా అత్యధిక పరుగులు చేసిన రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు. ప్రపంచకప్‌లో భారత్, ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో బ్యాటింగ్ కు దిగిన టీమిండియా ఓపెనర్ రోహిత్ అరుదైన రికార్డు సృష్టించాడు. కెప్టెన్‌గా ప్రపంచకప్ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.
రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడుతుండగా.. మధ్యలో ఓ వ్యక్తి ఫోన్ రింగ్ అయింది. దీనిపై రోహిత్ శర్మ కోపంగా.. "ఏంటీ, ఫోన్ ఆఫ్ చెయ్యి మ్యాన్" అని అన్నాడు. ఆ తర్వాత పిచ్ పరిస్థితి గురించి మాట్లాడు. ఇంతకుముందు కూడా.. రోహిత్ శర్మ తన ఫన్నీ స్టైల్స్, కామెంట్స్ తో చాలా సార్లు వైరల్ అయ్యాడు.
భారత్-ఆస్ట్రేలియా మధ్య జరగనున్న వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్‌కు ముందు.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మీడియా కాన్ఫరెన్స్ లో కీలక విషయాలు వెల్లడించాడు. ఆస్ట్రేలియా చివరి ఎనిమిది మ్యాచ్‌లలో విజయం సాధించినందుకు తనకు ఎటువంటి ఇబ్బంది లేదని రోహిత్ శర్మ చెప్పాడు. అంతేకాకుండా.. ఈ ప్రపంచకప్ కోసం రెండేళ్ల కిందటే సన్నాహాలు ప్రారంభించినట్లు తెలిపాడు.
Rohit Sharma: రోహిత్ శర్మ.. ప్రస్తుతం టీం ఇండియాను విజయపథంలో నడిపిస్తున్న సారథి. కెప్టెన్‌గా వరల్డ్ కప్ టోర్నీలో తన సత్తా చాటుతున్నారు. ఇటు ఓపెనర్‌గా బౌలర్లను ఊచకోత కోస్తూ.. తర్వాత వచ్చే బ్యాటర్లపై ఒత్తిడి లేకుండా చేస్తున్నాడు. మరోక్క విజయం సాధిస్తే, వరల్డ్ కప్ అందుకున్న మూడో భారత కెప్టెన్‌గా రోహిత్ శర్మ రికార్డులకెక్కుతారు. రేపు అహ్మదాబాద్‌లోని నరేంద్రమోడీ స్టేడియంలో లక్ష మంది ఫ్యాన్స్, భారత ప్రధాని నరేంద్రమోడీతో పాటు హై లెవల్ పీపుల్ మధ్య…
ప్రపంచకప్ 2023 ట్రోఫీని అందుకోవడానికి టీమ్ ఇండియా కేవలం ఒక్క అడుగు దూరంలోనే ఉంది. సెమీఫైనల్లో టీమిండియా 70 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించి ఫైనల్లోకి ప్రవేశించింది. నవంబర్ 19న నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగే ఫైనల్ మ్యాచ్‌కు రోహిత్ సేన సిద్ధంగా ఉంది.
Shreyas Iyer: స్వదేశంలో జరుగున్న వన్డే ప్రపంచకప్ టోర్నీలో భారత్ విజయానికి తిరుగులేకుండా పోయింది. ఒక్క ఓటమి కూడా లేకుండా ఫైనల్‌కి చేరుకుంది. వరల్డ్ కప్‌ని ముద్దాడటానికి కేవలం ఒక్క విజయానికి దూరంలో ఉంది. బుధవారం న్యూజిలాండ్‌తో ముంబై వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచు అనేక రికార్డులకు వేదికగా మారింది.
వరల్డ్ కప్ 2023లో భాగంగా నిన్న భారత్-న్యూజిలాండ్ మధ్య తొలి సెమీస్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా.. మొదటగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో 398 పరుగుల భారీ స్కోరును చేసింది టీమిండియా.. ఈ క్రమంలో కివీస్ పై 70 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్ లోకి దూసుకెళ్లింది. ఇదిలా ఉంటే.. ఈ టోర్నీలో కొత్త వివాదం వచ్చి పడింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ ఫిక్సింగ్…