టీ-20 వరల్డ్‌కప్ సూపర్-12 గ్రూప్‌లో పాక్‌పై భారత్ ఉత్కంఠభరిత విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ తన అనుభవాన్నంతా ప్రదర్శించడంతో టీమిండియా గెలుపు తీరాలకు చేరింది. కోహ్లీ ఆటతీరుకు ఎంతో మంది అభిమానులు మంత్రముగ్ధులయ్యారు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీకి మరోసారి మద్దతుగా నిలిచారు. కేంద్రంలోని బీజేపీ సర్కారుపై మండిపడ్డారు. కుట్రపూరిత రాజకీయాలతోనే సౌరభ్ గంగూలీని ఐసీసీ ఛైర్మన్ పదవికి నామినేట్ చేయలేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
Roger Binny: బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ శకం ముగిసింది. బీసీసీఐ 36వ అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా బీసీసీఐ అధికారికంగా వెల్లడించింది. ముంబైలో మంగళవారం బీసీసీఐ ఏజీఎం జరిగింది. ఈ సమావేశంలో బీసీసీఐ ఏకాభిప్రాయంతో రోజర్ బిన్నీని అధ్యక్షుడిగా ఎన్నుకుంది. ఈ పదవికి మరెవరూ పోటీ చేయకపోవడంతో బిన్నీ ఎన్నిక సులువుగా మారింది. మరోవైపు బీసీసీఐ సెక్రటరీగా మరోసారి జైషా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్‌గా రాజీవ్ శుక్లా, జాయింట్ సెక్రటరీగా…
బీసీసీఐ అధ్యక్షుడిగా రెండో సారి సౌరవ్ గంగూలీకి అవకాశం ఇవ్వకపోవడంపై తీవ్రంగా స్పందించారు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. గంగూలీని వంచించారని, అన్యాయంగా రేసు నుంచి తప్పించారని ఆమె ఆరోపించారు.
Ravi Shastri: బీసీసీఐ ప్రెసిడెంట్ పదవి నుంచి గంగూలీ తప్పుకోనున్న నేపథ్యంలో పలువురు మాజీ క్రికెటర్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. అయితే గంగూలీ, రవిశాస్త్రి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందన్న విషయం భారత క్రికెట్ అభిమానులందరికీ తెలిసిందే. టీమిండియా హెడ్ కోచ్ ఇంటర్వ్యూకు గంగూలీ ముందు హాజరుకావాలంటే గతంలో రవిశాస్త్రి ఎంతో ఆలోచించాడు. అటు బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ తీసుకున్న పలు నిర్ణయాలను కూడా రవిశాస్త్రి బాహాటంగానే విమర్శించాడు. ఈ నేపథ్యంలో గంగూలీ స్థానంలో రోజర్ బిన్నీ…
బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ స్థానంలో రోజర్ బిన్నీ బాధ్యతలు చేపట్టనున్నారనే వార్తల నేపథ్యంలో బీజేపీపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించింది. గంగూలీని పార్టీలో చేర్చుకునే ప్రయత్నాలు విఫలమైనందు వల్లే మాజీ కెప్టెన్‌ను అవమానపరిచేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించింది.
BCCI: ఈనెల 18తో బీసీసీఐ అధ్యక్ష, కార్యదర్శుల పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో కొత్తగా ఎవరిని ఎన్నుకుంటారనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రస్తుత కార్యదర్శి, కేంద్రమంత్రి అమిత్ షా కుమారుడు జై షా తదుపరి బీసీసీఐ అధ్యక్షుడు అని కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. తాజాగా మరో కొత్త పేరు తెరపైకి వచ్చింది. టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ రోజర్ బిన్నీ బీసీసీఐ అధ్యక్ష పదవి రేసులో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. బీసీసీఐ వార్షిక సాధారణ సమావేశంలో కర్ణాటక…