అన్నపూర్ణ స్టూడియోస్ తో పాటు అక్కినేని నాగార్జునకు పర్శనల్ మేకప్ మేన్ గా పనిచేసిన బొమ్మదేవర రామచంద్రరావు గతంలో అనుష్క నాయికగా ‘పంచాక్షరి’ చిత్రాన్ని సముద్ర దర్శకత్వంలో నిర్మించారు. ఇప్పుడు బొమ్మదేవర శ్రీదేవి సమర్ఫణలో సాయిరత్న క్రియేషన్స్ బ్యానర్ లో రెండో చిత్రానికి ఆయన శ్రీకారం చుట్టారు. ఈ సినిమాకు ఆయనే దర్శకత్వం వహిస్తున్నారు. మరో విశేషం ఏమంటే ఈ సినిమా ద్వారా తన కొడుకు తేజ్ బొమ్మదేవరను హీరోగా పరిచయం చేస్తున్నారు. రిషిక లోక్రే…