ధాన్యం కొనుగోలులో ఒక్క రైతూ ఇబ్బంది పడకూడదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. నిర్లక్ష్యంగా ఉండే అధికారులు, ఉద్యోగులపై కఠిన చర్యలు తప్పవని సీఎం హెచ్చరించారు. ధాన్యం సేకరించిన 48 గంటల్లోనే రైతులకు నగదు అందాలని అధికారులకు సూచించారు. నేడు 26 జిల్లాల కలెక్టర్లు, అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పౌర సరఫరాల శాఖ ద్వారా ధాన్యం కొనుగోలు ప్రక్రియ వివరాలను అధికారులను అడిగి తెలుకున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ……
తెలంగాణ రాష్ట్రం ఈ ఏడాది వరి దిగుబడిలో కొత్త రికార్డులను సృష్టించబోతుందని, 150 లక్షల మెట్రిక్ టన్నుల వరి దిగుబడికి అవకాశం ఉన్నట్లు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావులు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా రికార్డ్ స్థాయిలో ధాన్యం దిగుబడిని చూడబోతున్నామని, అందులో 91 లక్షల మెట్రిక్ టన్నుల వరి కొనుగోలు చేసే అవకాశముందని చెప్పారు.
ధాన్యం కొనుగోళ్ల అంశం పై ఢిల్లీలో పోరాటానికి సిద్ధమవుతోంది టీఆర్ఎస్ పార్టీ. వరిపోరును ఉధృతం చేసింది టీఆర్ఎస్ పార్టీ. వరుస ఆందోళనలతో హీట్ పుట్టిస్తున్న గులాబీ పార్టీ నేతలు గురువారం తెలంగాణలోని అన్ని జిల్లాకేంద్రాల్లో దీక్షలు చేపట్టింది. టీఆర్ఎస్ దీక్షలతో జిల్లా కేంద్రాలన్నీ హోరెత్తాయి. దీక్షలకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, రైతుబంధు సమితి ఛైర్మన్లు సహా ఇతర ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు. సిరిసిల్లలోని అంబేడ్కర్ కూడలిలో నిర్వహించిన నిరసన దీక్షలో మంత్రి కేటీఆర్…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం-కేంద్రం మధ్య ధాన్యం విషయంలో మాటల యుద్ధం సాగుతోంది. ఢిల్లీ సాక్షిగా కేంద్ర ఆహారమంత్రి పీయూష్ గోయల్- రాష్ట్ర మంత్రి ప్రశాంత్ రెడ్డి మధ్య వాదులాట చోటుచేసుకుంది. “పంజాబ్ తరహాలో బియ్యాన్ని కొనుగోలు చేసినట్టే తెలంగాణలో కూడా బియ్యాన్ని కొనండన్నారు ప్రశాంత్ రెడ్డి. దీనికి ప్రతిగా “పంజాబ్ లాగానే, తెలంగాణ కూడా బియ్యాన్ని సరఫరా చేయండని సమాధానం ఇచ్చారు పీయూష్ గోయల్. తెలంగాణ లో వాతావరణ పరిస్థితుల రీత్యా యాసంగి ధాన్యాన్ని మిల్లింగ్ చేస్తే…
ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం వైఖరిపై తెలంగాణ మంత్రులు మండిపడ్డారు. మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు కేంద్రం అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం క్షమాపణలు చెప్పే పరిస్థితి వస్తుంది. ఈ పరాభవాన్ని తెలంగాణ ప్రజలు మర్చిపోరు. ఏ అంశంలోనూ నవ్యత్వం లేదు. కేంద్ర ప్రభుత్వానికి వ్యాపారధోరణితో వ్యవహరించడం తప్పితే, సంక్షేమం గురించి ఆలోచించే మనసే లేదు. ముఖ్యమంత్రి ఆలోచించి తదుపరి కార్యాచరణ ఖరారు చేస్తాం. అయితే, ఏది ఏమైనా, రైతుల ప్రయోజనాలను మా ప్రభుత్వం…