మరికొద్ది రోజుల్లో దివంగత సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తొలి వర్ధంతి రాబోతోంది. అయితే, మొదట్లో పెను సంచలనంగా మారిన అనుమానాస్పదం కేసు తరువాత క్రమంగా వార్తల్లోంచి తప్పుకుంది. కానీ, ఈ మధ్యే సుశాంత్ రూమ్ మేట్ సిద్ధార్థ్ పితాని పోలీసులకు చిక్కాడు. అతడ్ని ప్రస్తుతం కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇటువంటి సమయంలో రియా చక్రవర్తి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులకి గతంలో ఇచ్చిన స్టేట్మెంట్ మీడియా చేతికి చిక్కింది. అందులో సారా అలీఖాన్ పేరు కూడా…