రామ్ గోపాల్ వర్మ మరోసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ వరుస ట్వీట్లు చేశారు. ఆయనని పాన్ ఇండియా స్టార్ గా చూడాలని కోరుతున్నానని వర్మ పేర్కొన్నారు. ”పవన్ కళ్యాణ్ గారూ, ఆ రోజు సర్దార్ గబ్బర్ సింగ్ హిందీలో రిలీజ్ చెయ్యొద్దు వర్కవుట్ అవ్వదు, అని ఈ ట్విట్టర్ సాక్షిగా ఎంత మొత్తుకున్నా మీరు వినలేదు.. ఫలితం చూశారు…ఇప్పుడు మళ్లీ చెప్తున్నా .. భీమ్లా నాయక్ ఏ మాత్రం తగ్గకుండా పాన్…
రాజకీయ నాయకులు కొండా మురళి, కొండా సురేఖపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో “కొండా” మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘కొండా’ ట్రైలర్ ఆర్జీవీ వాయిస్ ఓవర్‌తో ప్రారంభమయ్యింది. తైలం లో కొండా మురళి ఎంట్రీ కోసం ‘ఎక్స్‌ట్రీమ్ పీపుల్ ఎమర్జ్ ఫ్రమ్ ఎక్స్‌ట్రీమ్ సిట్యుయేషన్’ అనే కార్ల్ మాక్స్ కోట్‌ను కూడా ఉదహరించాడు. Read Also : హీరో శ్రీకాంత్ కు కోవిడ్ పాజిటివ్ ‘కొండా’…
దర్శకుడు రాంగోపాల్ వర్మ (ఆర్జీవీ).. నందమూరి బాలకృష్ణ లవ్‌లో పడిపోయారు.. అదేంటి? బాలయ్యతో ఆర్జీవీ లవ్ ఏంటి? అనుకుంటున్నారేమో… ‘ఆహా’లో ప్రసారమవుతున్న ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే’ షోతో ప్రేమలో మునిగితేలుతున్నారు ఆర్జీవీ.. టాలీవుడ్ హీరో బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షోలో ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు సందడి చేశారు.. మోహన్‌బాబు ఫ్యామిలీ, దర్శక ధీరుడు రాజమౌళి, పూరి జగన్నాథ్, అల్లు అర్జున్, రవితేజ, రానా, నాని, బ్రహ్మానందం, ఎంఎం కీరవాణి.. ఇలా చాలా మందిని తన…
ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల వ్యవహారం ఓ దశలో ప్రభుత్వం వర్సెస్ టాలీవుడ్‌గా మారింది.. అయితే, ఈ వ్యవహారం మరింత రచ్చగా మారకుండా సినీ పెద్దలు కొందరు రంగంలోకి దిగి ప్రభుత్వంలో చర్చలు జరపడం.. ప్రభుత్వం కమిటీ వేయడం.. ఆ కమిటీ వరుసగా సమావేశాలు అవుతూ.. వివిధ సమస్యలపై చర్చించడం జరుగుతోంది.. మరోవైపు.. ఏ విషయమైనా కుండ బద్దలు కొట్టినట్టుగానే మాట్లాడే వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా ఈ వ్యవహారంలో ఎంట్రీ ఇచ్చాడు.. కొన్ని సందర్భాల్లో మైక్…
అప్ టిక్కెట్ల వ్యవహారంపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పట్లో తగ్గేలా కన్పించడం లేదు. ట్విట్టర్ లో ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో వార్ తరువాత ఆయనను కలవడానికి అనుమతి అడిగాడు. ఆయన కూడా సరేనని చెప్పడంతో నిన్న ఏపీ సచివాలయంలో ఆయనను కలిసి మాట్లాడారు. అయితే ఆర్జీవీ, పేర్ని నాని భేటీతో టాలీవుడ్ కు, ఏపీ ప్రభుత్వానికి మధ్య ఏర్పడిన గ్యాప్ ఏమన్నా తగ్గుతుందేమో అని అంతా ఎదురు చూస్తున్నారు. అయితే అలా…
ఏపీలో సినిమా టికెట్ రేట్ల విషయంపై తాజాగా ఆర్జీవీ, సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని భేటీ అటు సినిమా, ఇటు రాజకీయ వర్గాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది. ఈరోజు మధ్యాహ్నం 12.30 గంటలకు ఏపీ సచివాలయానికి చేరుకున్న ఆర్జీవీ మంత్రి పేర్ని నాని ఛాంబర్ లో కలిసి మాట్లాడుతున్నారు. గంట నుంచి కొనసాగుతున్న ఈ మీటింగ్ లో టికెట్ల రేట్ల తగ్గింపు వల్ల థియేటర్ యాజమాన్యాలకు నష్టం వాటిల్లుతుందని, ట్విట్టర్ వేదికగా తాను చెప్పిన అంశాలపై…
ఏపీలో గత కొన్ని రోజులుగా సినిమా టికెట్ రేట్ల విషయంపై వివాదం నడుస్తున్న విషయం తెల్సిందే. ఇదే విషయంపై ఈరోజు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని భేటీ కానున్నారు. ఇదివరకు ఇండస్ట్రీ నుంచి పలువురు పెద్దలు ప్రయత్నించి విఫలమైన ఈ అంశాన్ని వర్మ ఎలా డీల్ చేయబోతున్నాడు ? అనేది ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ నేపథ్యంలో ఆర్జీవీ, పేర్ని నానిది టైంపాస్ మీటింగ్, ఈ కార్పోరేట్ భేటీలో కేవలం…
ఏపీలో సినిమా టికెట్ల ధరలపై చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఏపీ ప్రభుత్వం జీవో నెం 35ను ప్రవేశపెట్టి సినిమా టికెట్ల ధరలు నిర్ణయించి ఆ ధరలకంటే ఎక్కువకు అమ్మకూడదని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో పలువురు నిర్మాతలు, ఎగ్జిబిటర్లు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో విచారణ చేపట్టిన హైకోర్టు ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవోను రద్దు చేసింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం డివిజన్ బెంచ్‌లో అప్పీల్ చేయడంతో మరోసారి హైకోర్టు ఏపీ సినిమా టికెట్లపై…