ప్రెస్ మీట్లు కాదు.. ప్రజల ఇబ్బందులపై సమీక్ష చేయండని ఎంపీ దర్మపురి అరవింద్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పై విరుచుకు పడ్డారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాతూ.. 5 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్రం అతలాకుతలమవుతోందని పేర్కొన్నారు. చెరువులు, రిజర్వాయర్లు కూడా పూర్తిగా నిండిపోయాయని తెలిపారు. ముందే జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంది ప్రజలను కాపాడొచ్చని సలహా ఇచ్చారు. ఇరిగేషన్ అధికారులు, జిల్లా అధికారుల సమన్వయ లోపం కళ్ళకు…