Jagga Reddy : కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి గాంధీ భవన్లో నిర్వహించిన ప్రెస్ మీట్లో బీజేపీ నేత ఈటెల రాజేందర్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై కాంగ్రెస్ పార్టీ మునుపటి నుండి స్పష్టమైన స్థానం తీసుకుందని జగ్గారెడ్డి గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ తప్పు అని జగమెరిగిన సత్యమని, అప్పట్లో ఈటల రాజేందర్ కూడా ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వామిగా ఉన్నారన్నారు. ఇప్పుడు ఆయన అవినీతిపై మౌనంగా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోందని జగ్గారెడ్డి…
CM Revanth Reddy : యాదాద్రి భువనగిరి జిల్లాలో నేడు సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. తుర్కపల్లి మండలంలో 66 వేల ఆయకట్టు లక్ష్యంగా నిర్మించబోతున్న గంధమల్ల రిజర్వాయర్ కు శంకు స్థాపన చేశారు. అలాగే ఇంటిగ్రేటెడ్ స్కూల్, యాదగిరిగుట్ట మెడికల్ కాలేజ్, వేద పాఠశాల నిర్మాణాలకు భూమి పూజ చేశారు. కొలనుపాక-కాల్వపల్లి హైలెవెల్ వంతెన, మోటకొండూరులో ఎంపీపీ, మండలాఫీసు, పోలీస్…
Indiramma Indlu : తెలంగాణ రాష్ట్రంలో గిరిజనుల పట్ల ప్రత్యేక దృష్టితో పథకాలు అమలవుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు, పేదలు నివసించే ప్రాంతాల్లో జీవనోపాధికి ఆటంకం లేకుండా జీ+3 మోడల్లో ఇండ్ల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం ద్వారా ఆదివాసీలకు నివాస హక్కు కల్పించడమే కాకుండా, వారు జీవించేందుకు అవసరమైన వనరులను అందుబాటులో ఉంచే దిశగా చర్యలు కొనసాగుతున్నాయి. ఇక పట్టణాల్లోనూ ఇందిరమ్మ ఇండ్లు పథకం కార్యరూపం దాల్చనుంది. REDMAGIC 10S…
TG Cabinet : తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం విజయవంతంగా ముగిసింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ భేటీ సుమారు ఐదు గంటల పాటు సాగింది. రాష్ట్ర అభివృద్ధితో పాటు, ప్రజల సంక్షేమంపై దృష్టి సారించిన ఈ సమావేశంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒక డీఏ (డియర్నెస్ అలౌయెన్స్) ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. దీని ద్వారా ప్రభుత్వ ఉద్యోగులకు కొంత ఆర్థిక ఉపశమనం లభించనుంది. విస్తృతంగా చర్చించి ఈ…
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అమలైన హరిత హారం కార్యక్రమం రాష్ట్రంలో హరిత విప్లవాన్ని సృష్టించిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా తెలంగాణలో గ్రీన్ కవర్ 24% నుంచి 31%కి పెరిగిందని.. అంటే 7.7% వృద్ధిని సాధించి దేశానికి ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. మొత్తం 250 కోట్ల మొక్కలు నాటి, రాష్ట్రాన్ని హరిత తెలంగాణగా మార్చిన ఘనత కేసీఆర్ దని కొనియాడారు. తాము మేం కేవలం ఆకుపచ్చని తెలంగాణ గురించి మాట్లాడలేదని..…
గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద బాధితుల పట్ల విద్యుత్ శాఖ అధికారి అమానవీయ ప్రవర్తనపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. సంబంధిత అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలని అభ్యర్థిస్తూ సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. లేఖలో ఇలా రాసుకొచ్చారు. చార్మినార్‌లోని గుల్జార్ హౌస్‌లో జరిగిన వినాశకరమైన అగ్నిప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 17 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ సంఘటన మన నగరాన్ని కలచివేసింది.
అమెరికాలో ఉద్యోగం చేసిన కవితకు తెలంగాణ పౌరుషం లేదని బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్‌రెడ్డి అన్నారు. తమ లాంటి వారికి తెలంగాణ వాదం నేర్పించింది బీజేపీ అని.. తమకు కాకుండా ఇంకెవరికి తెలంగాణ పౌరుషం ఉంటది? అన్నారు. తమది హిందుగాళ్లు బొందు గాళ్లు అన్న రక్తం కాదని.. కవిత స్టేట్మెంట్ ఇచ్చే ముందు స్థాయి చూసుకోవాలని విమర్శించారు. తాజాగా ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు.
TG Cabinet : రాష్ట్రంలో కొనసాగుతోన్న తెలంగాణ ప్రభుత్వం కీలక అభివృద్ధి, పరిపాలనా అంశాలపై చర్చించేందుకు జూన్ 5న కేబినెట్ సమావేశం నిర్వహించనుంది. మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర సచివాలయంలో ఈ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం కీలక నిర్ణయాలకు వేదికకానుంది. ఈ సమావేశంలో పలు ముఖ్య అంశాలపై చర్చ జరగనుంది. ముఖ్యంగా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఇచ్చిన నివేదికపై ఈ సమావేశంలో విశ్లేషణ…
CM Revanth Reddy : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జపాన్ కిటాక్యూషు నగర ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర భవిష్యత్తు కోసం కొత్త అంతర్జాతీయ భాగస్వామ్యాలు ఎలా నిర్మించబడుతున్నాయో వివరించారు. “తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు, రాష్ట్ర పురోగతిని వేగవంతం చేయడం కోసం, కొత్త ప్రపంచ భాగస్వామ్యాలను ఏర్పాటు చేయడమే మా లక్ష్యం,” అని సీఎం పేర్కొన్నారు. Khaleja : ‘ఖలేజా’ చూపించిన మహేశ్.. మూడు రోజుల్లోనే భారీ…
Mallu Ravi : కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. రేపటితో (జూన్ 2) 11వ తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్పారు. ఈ సందర్భంగా మల్లు రవి, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సామాజిక న్యాయ కార్యక్రమాలను వివరించారు. మల్లు రవి మాట్లాడుతూ, “తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను గత ప్రభుత్వాలు…