రామ్‌చరణ్ స్కూల్ కి వెళ్ళేటప్పుడు నుంచి తెలుసని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఇవాళ హీరో అయ్యాడు. RRR తో దేశానికి గౌరవం తెచ్చి పెట్టాడని కొనియాడారు. ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు వచ్చిందని గుర్తు చేశారు. తాజాగా హైదరాబాద్ శిల్పకళా వేదికలో యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో జరుగుతున్న అంతర్జాతీయ యాంటీ డ్రగ్, ఇల్లీగల్ ట్రాఫికింగ్ డే అవగాహన కార్యక్రమంలో సీఎం రేవంత్, హీరోలు రామ్‌చరణ్, విజయ్ దేవరకొండ హాజరయ్యారు. ఈ సందర్భంగా రామ్ చరణ్, విజయ్ దేవరకొండకు ముఖ్యమంత్రి స్వయంగా బ్యాడ్జ్ పెట్టారు.
READ MORE: Atal Pension Yojana: ఈ పథకం అద్భుతం.. భార్యాభర్తలిద్దరు ప్రతి నెల రూ. 10 వేలు పొందే ఛాన్స్
అనంతరం ఆయన హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రస్తావించారు. 2006 లో నేను రాజకీయాలు మొదలు పెట్టిన.. నల్లమల నుంచి వచ్చి.. ఇప్పుడు సీఎం అయ్యానని సీఎం రేంత్ గుర్తు చేశారు. నల్లమల నుండే విజయ దేవరకొండ వచ్చాడని.. తమ పక్క ఊరే అని తెలిపారు. ఇవాళ హీరో అయ్యాడని కొనియాడారు. హీరో లు సినిమాలో పోషించిన పాత్ర ను కాదు.. జీవితంలో వాళ్ళు ఎలా ఎదిగారు అనేది ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.
READ MORE: Pakistan: భారత రక్షణ సమాచారాన్ని చైనా మాకు అందించింది: పాక్ రక్షణ మంత్రి..