నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెచ్చుకున్న రాష్ట్రంలో నీళ్లు జగన్ తీసుకెళ్లిండు, నిధులు మెగా కృష్ణారెడ్డి, కేసీఆర్ తీసుకెళ్లారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. తుంగతుర్తిలో కాంగ్రెస్ బహిరంగ సభలో రేవంత్ ప్రసంగించారు.
Revanth Reddy: మహేశ్వరం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని, 25 వేల మెజారిటీతో కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి గెలవబోతున్నారని పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు.
Revanthreddy: నేడు నాలుగు నియోజకవర్గాల్లో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. నకిరేకల్, తుంగతుర్తి, ఆలేరు, కామారెడ్డి నియోజకవర్గాల్లో ప్రచార సభల్లో పాల్గొననున్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి కేటీఆర్ మక్తల్ రోడ్ షో లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డిసెంబర్ 3 తర్వాత కొన్ని పథకాలు ప్రారంభిస్తున్నామని తెలిపారు. 2014లో సిలిండర్ కు మొక్కండి.. ఓటు వేయండి అని మోదీ అన్నారు. ఆనాడు రూ.400 సిలిండర్ ఇప్పుడు రూ.1200 అయ్యిందని కేటీఆర్ తెలిపారు. జనవరి నుంచి కొత్త రేషన్ కార్డులు ఇస్తాం.. రేషన్ కార్డులు ఉన్నవారికి సన్న బియ్యం ఇస్తామని ఈ సందర్భంగా చెప్పారు.
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంటలో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మానకొండూర్ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మార్పు రావాలి కాంగ్రెస్ గెలవాలి, బై బై కేసీఆర్ నినాదంతో రేవంత్ రెడ్డి కార్యకర్తల్లో జోష్ నింపారు. కరీంనగర్ గడ్డ మీద తెలంగాణ రాష్ట్రం ఇస్తామని సోనియమ్మ మాట ఇచ్చింది..…
దుబ్బాకకి పట్టిన శని కేసీఆర్ కుటుంబం.. నువ్వు బక్కోనివి కాదు బకాసూరిడివి.. ఫామ్ హౌస్ లో పడుకునే కుంభకర్ణుడివి అంటూ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండి రమేష్ కు మద్దతుగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రోడ్ షోలో మాట్లాడుతూ.. వృద్దులకు పెన్షన్లు ఇవ్వటం కాదు.. ఇంట్లో ఉన్న యువతకు ఉద్యోగాలు కల్పించాలి.. పీజీ, పీహెచ్ డీలు చదువుకున్న వారిని బర్రెలు, గొర్రెలు కాసుకోమంటున్నాడు.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలకు జాబ్ కాలెండర్ విడుదల చేస్తాము అని ఆయన తెలిపారు.
Revanth Reddy: నేడు కరీంనగర్, సిద్దిపేట జిల్లాలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ముందుగా దుబ్బాకలో జరిగే కాంగ్రెస్ బహిరంగ సభలో పాల్గొననున్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా.. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గజ్వేల్ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రెండుసార్లు కేసీఆర్ ను ఎమ్మెల్యేను చేస్తే... మల్లన్న సాగర్ లో మిమ్మల్ని నిండా ముంచాడని ఆరోపించారు. కొండపోచమ్మలో మిమ్మల్ని తోసిండు, రంగనాయక్ సాగర్ లో ముంచిండని విమర్శించారు.
ఈ ఎన్నికలు ఆశామాషీ ఎన్నికలు కాదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్లో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి యాత్రలో రేవంత్ మాట్లాడారు. పదేళ్లలో పోడు భూముల సమస్య తీర్చలేదు.. లంబాడాలను ఆదుకోలేదని ఆయన విమర్శించారు.