K. Laxman: రూ.2 లక్షలు రుణమాఫీ ఎందుకు చేయలేదు రేవంత్ రెడ్డి అని సీఎంకు ఎంపీ రాజ్యసభ కె.లక్ష్మణ్ ప్రశ్నించారు. సంగారెడ్డి రైతు సత్యాగ్రహ దీక్షలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ..
Kishan Reddy: ఇచ్చిన హామీలు అమలుకు.. కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల్లో నోట్లు ముద్రించే మిషన్ లు పెడతారేమో అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
విశ్వేశ్వరెడ్డి, రంజిత్ రెడ్డి తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే విధంగా వ్యవహరించారని.. రంజిత్ రెడ్డి అయితే మరీ దారుణంగా మోసం చేశాడని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. వికారాబాద్ నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. మహేందర్ రెడ్డి భార్య వికారాబాద్లో ఆనంద్ ను ఓడిపోయేలా చేశారని విమర్శించారు మహేందర్ రెడ్డి, రంజిత్ రెడ్డి కలిసి పరిగి సమావేశంలో డ్రామాలు చేశారు.
జమ్మూ కాశ్మీర్లో జరిగే ఎన్నికలకు 27 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితాను కాంగ్రెస్ (INC) ఇవాళ (శనివారం) విడుదల చేసింది. ఐదు దశల్లో జరగనున్న లోక్సభ ఎన్నికల సందర్భంగా ఈ నేతలు జమ్మూ కాశ్మీర్లో పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేయనున్నారు.
Kadiyam Srihari: ఇవాళ అనుచరులతో కడియం భేటీ అయ్యారు. పార్టీ మార్పు, భవిష్యత్ కార్యాచరణపై చర్చ నిర్వహించారు. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డిని కలిసే అవకాశం ఉందని సమాచారం.
CM Revanth Reddy: నేడు పీఈసీ కమిటీ సమావేశం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన గాంధీభవన్లో జరగనుంది. రానున్న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది.
కొడంగల్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో రేవంత్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 4 గంటల వరకు జరిగింది. దీని కోసం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పరిధిలో 10 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.